Messi: రూ.10 లక్షలు కొట్టు.. మెస్సీతో ఫోటో దిగు!

Messi

Messi: తెలంగాణ రాష్ట్రంలో మెస్సీ ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ కూడా ఫుట్ బాల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఉప్ప‌ల్ వేదిక‌గా ఈ నెల 13వ తేదీన మ్యాచ్ ఉండ‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారు అయింది. ఈ తరుణంలోనే రూ.10 లక్షలు కొట్టు.. మెస్సీతో ఫోటో దిగు అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారింది. Messi

10 lakhs take a photo with Messi

ఆఖరికి.. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ స్టార్డమ్‌పై కూడా బిజినెస్ చేస్తున్నార‌ని బీఆర్ ఎస్ పార్టీ పోస్ట్ వైర‌ల్ గా మారింది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీతో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమాన్ని ‘ద గోట్ టూర్’ నిర్వహించనున్నారు. అక్కడ మెస్సీతో ఫోటో దిగొచ్చని.. ఒక్కో ఫోటోకు గాను రూ.10 లక్షలు చెల్లించాలని పేర్కొంటున్నారు నిర్వహకులు. డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయని.. కేవలం 100 మందికే ఈ అవకాశమని వెల్లడించార‌ట‌. ఇప్పుడు ఈ న్యూస్ వైర‌ల్ గా మారింది. Messi

Also Read: DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణ‌ను అవ‌మానించిన డీకే శివ‌కుమార్ ?

ఇది ఇలా ఉండ‌గా, రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఫోటో దిగారు. 60వ ఢిల్లీ పర్యటనలో ఈ సౌభాగ్యం పొందారు. సీనియర్ నాయకుడు శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ సంద‌ర్భంగా అదే కార్యక్రమానికి వచ్చి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కలిశారు రేవంత్ రెడ్డి. Messi

Also Read: KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్ర‌హం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu