CM Revanth Vs Lionel Messi: హైద‌రాబాద్ లో మెస్సీ మ్యాచ్.. రూ.100 కోట్లు ఖర్చు ?

CM Revanth Vs Lionel Messi
CM Revanth Vs Lionel Messi

CM Revanth Vs Lionel Messi: ఇవాళ హైద‌రాబాద్ కు లియోనెల్ మెస్సి రానున్న సంగ‌తి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 7 గంట‌ల‌కు ఉప్ప‌ల్ లో సీఎం రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ లియోనెల్ మెస్సి మ‌ధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా జ‌రుగ‌నుంది. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. అయితే, లియోనెల్ మెస్సి ఫుట్ బాల్ మ్యాచ్ నేప‌థ్యంలో మాజీ మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. CM Revanth Vs Lionel Messi

CM Revanth Vs Lionel Messi Match HArish rao slams

మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్ బాల్ ఆడడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాడని బాంబ్ పేల్చారు హ‌రీష్ రావు. బాగ్ లింగంపల్లి గురుకుల విద్యార్థులు 90 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైతే, ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదని నిప్పులు చెరిగారు హ‌రీష్ రావు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా ఉన్నారని నిప్పులు చెరిగారు లియోనెల్ మెస్సి. CM Revanth Vs Lionel Messi

Also Read: Konda Surekha: బస్వరాజు సారయ్య కుట్ర‌లు…కొండా దంప‌తుల‌ను వీడుతున్న నేత‌లు ?

రూ.100 కోట్లతో ఫుట్ బాల్ ఆడేకంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి, కడుపు నిండా మంచి ఆహారం పెట్టొచ్చు కదా అంటూ నిలదీశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అంటున్నాడు.. కానీ ఇది పాయిజన్ 2047 అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు మంచాలపై పడుతున్నారని ఆరోప‌ణ‌లు చేశారు హ‌రీష్ రావు. అస్వస్థతకు గురైన పిల్లలు తిరిగి గురుకులాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని విమ‌ర్శ‌లు చేశారు హరీష్ రావు. CM Revanth Vs Lionel Messi

Also Read: Kavitha: నేను ముఖ్య‌మంత్రి అవుతా..కేటీఆర్ ను జైలుకు పంపిస్తా?

Share your love