K Ramp Review: కిరణ్ అబ్బవరం “K-RAMP” మూవీ రివ్యూ!!

Kiran abbavaram k ramp movie review
Kiran abbavaram k ramp movie review

నటీనటులు : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయి కుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు ( K Ramp Review )

దర్శకుడు : జైన్స్ నాని

నిర్మాత : రాజేష్ దండ, శివ బొమ్మక్

సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రాఫర్ : సతీష్ రెడ్డి మాసం

ఎడిటర్ : చోటా కే ప్రసాద్

విడుదల తేదీ: 18-10-2025

Kiran abbavaram K Ramp Review

యువ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి దీపావళికి ప్రేక్షకులను అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత సంవత్సరం ‘క’ సినిమా తో హిట్ కొట్టిన కిరణ్ ఈ సారి మరోసారి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భావోద్వేగం, వినోదం కలిపిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ, బాధ్యత, కుటుంబ విలువలు, మరియు భావోద్వేగాలను ప్రధానాంశాలుగా తీసుకుని రూపొందిన ఈ చిత్రం 140 నిమిషాల నిడివితో ప్రేక్షకులను బాగా అలరిస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: కుమార్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు తన జీవితాన్ని సరదాగా గడిపే వ్యక్తి. రిచ్ గా పుట్టినా మాస్ గా అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో చదువు రీత్యా కేరళ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ఒక సందర్భంలో యుక్తి (యుక్తి తారేజా)ని కలుసుకుని ప్రేమలో పడతాడు. కానీ యుక్తికి ఒక మానసిక సమస్య (disorder) ఉంటుంది. ఆ సమస్య వెనుక ఉన్న కారణం తెలుసుకుని హీరో ఆమెను ఎలా అర్థం చేసుకున్నాడు, ఆమెను సాధారణ జీవితానికి ఎలా తీసుకువచ్చాడు, ఆ ప్రయాణంలో అతని కుటుంబం, స్నేహితుల పాత్ర ఎలా ఉంటుందనేది కథలోని ప్రధాన అంశం.

నటీనటులు: హీరో కిరణ్ అబ్బవరం తన నటనతో ఈ చిత్రానికి ప్రధాన బలం అయ్యాడు. కామెడీ సన్నివేశాల్లో సహజంగా నటిస్తూ భావోద్వేగ సన్నివేశాల్లో మెరిపించాడు. ముఖ్యంగా హీరోయిన్ సమస్యను అర్థం చేసుకునే సన్నివేశాల్లో ఆయన చూపించిన హావభావాలు హృదయాన్ని తాకుతాయి. యుక్తి తారేజా తన పాత్రను చాలా బాగా పోషించింది. కొత్త నటీమణులకు అందని స్థాయిలో ఆమె ఎమోషన్‌లను చక్కగా వ్యక్తం చేసింది. ఈ సినిమాలో హీరో తర్వాత ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది నరేష్ పాత్ర. మొదటి నుంచి మంచి కామెడీ పండిస్తూ సినిమా కే హైలైట్ గా నిలిచాడు. సాయి కుమార్ మరియు మురళీధర్ గౌడ్ తండ్రి భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు. వారి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల కంట తడి పెట్టిస్తాయి. వెన్నెల కిషోర్ తన ప్రత్యేకమైన టైమింగ్‌తో మొదటి భాగంలో మంచి వినోదం పంచాడు. చిన్నపాత్రలు చేసిన నటులు కూడా తమ వంతు న్యాయం చేశారు. మొత్తంగా నటీనటులందరు ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు: సినిమా సాంకేతికంగా బాగా రూపొందించబడింది. దర్శకుడు కథను సున్నితంగా నడిపిస్తూ, భావోద్వేగాలను సరిగ్గా మిళితం చేశారు. మొదటి భాగంలో సరదా వాతావరణం, రెండో భాగంలో కథ — ఈ రెండు టోన్లను సమతూకంగా మలచడంలో ఆయన నైపుణ్యం స్పష్టంగా కనిపించింది. సంగీత దర్శకుడు అందించిన పాటలు మెలోడీగా నిలిచి ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథ భావోద్వేగాలకు బలాన్ని చేకూర్చింది. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ ఆకర్షణీయంగా, ప్రతి ఫ్రేమ్ ఫ్యామిలీ మూడ్‌కి అనుగుణంగా తీర్చిదిద్దారు. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్నీ కథకు సహజత్వాన్ని తెచ్చాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

కిరణ్ అబ్బవరం నటన
హీరోయిన్ గ్లామర్
కామెడీ సీన్స్
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్:

తక్కువ లవ్ ట్రాక్
అక్కడక్కడ నెమ్మదించడం

తీర్పు: మొత్తం గా ఈ చిత్రం భావోద్వేగం, ప్రేమ, కుటుంబ విలువలతో ముడిపడిన హృదయాన్ని తాకే ఫ్యామిలీ డ్రామా. మొదటి భాగం సరదాగా సాగి, రెండో భాగంలో కథలోని లోతు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కిరణ్ అబ్బవరం నటన, యుక్తి తారేజా ప్రదర్శన, మ్యూజిక్ — ఇవన్నీ సినిమాకు ప్రధాన బలాలు. కొన్నిచోట్ల నెమ్మదిగా సాగినా, హృదయానికి హత్తుకునే భావనను చివరి వరకు నిలబెట్టడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఫ్యామిలీ ఆడియెన్స్, భావోద్వేగ కథలను ఇష్టపడేవారికి ఇది మంచి సినిమా.

ట్యాగ్ లైన్: హీరో లైఫ్ మార్చిన హీరోయిన్ వీక్ నెస్

రేటింగ్ : 3.25/5

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu