Actress: బయటపడ్డ నటి బాగోతం.. నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్.. 2 కోట్లు ఇస్తే.!

Actress: చాలామంది ఇండస్ట్రీలో ఉండే నటీనటుల బాగోతం బయటపడే వరకు తెలియదు.అప్పటి వరకు ఏమీ తెలియని సుద్దపూసల్లా కనిపిస్తారు. కానీ ఒక్కసారి వారి గురించి ఒక విషయం

Actress blackmailed with nude videos

Actress: చాలామంది ఇండస్ట్రీలో ఉండే నటీనటుల బాగోతం బయటపడే వరకు తెలియదు.అప్పటి వరకు ఏమీ తెలియని సుద్దపూసల్లా కనిపిస్తారు. కానీ ఒక్కసారి వారి గురించి ఒక విషయం బయటపడితే దాని నుండి మరెన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. అలా తాజాగా ఓ నటికి సంబంధించిన షాకింగ్ విషయం కూడా బయటపడింది. ఓ మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించి ప్రైవేటు ఫోటోలను పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఏకంగా రెండు కోట్లు ఇస్తావా లేకపోతే నీ నగ్న వీడియోలు బయటపెట్టనా అంటూ బ్లాక్మెయిల్ చేస్తోంది.

Actress blackmailed with nude videos

మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే కన్నడ సీరియల్ నటి ఆశా జోయిస్.. కన్నడ సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆశా జోయిస్ పార్వతి అనే మహిళతో కొన్ని రోజులు స్నేహం చేసింది.తాను టీవీ సీరియల్ లో చేసే నటిని అని తనకు తాను పరిచయం చేసుకొని చాలా రోజులు పార్వతితో సన్నిహితంగా మెదిలి ఆమెకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలు తెలుసుకోవడంతో పాటు ఆమె దగ్గర నుండి సీక్రెట్ గా పర్సనల్ ఫోటోలు,వీడియోలు కలెక్ట్ చేసింది.(Actress)

Also Read: Heroines: నచ్చకపోతే ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకోవచ్చు.. దుమారం రేపుతున్న స్టార్ హీరోయిన్ల కామెంట్స్.!

ఆ తర్వాత ఆ ఫోటోలను వీడియోలను దగ్గర పెట్టుకొని ఆ మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ నీ ప్రైవేట్ ఫోటోలు బయట పెట్టమంటావా.. లేకపోతే డబ్బులు ఇస్తావా అని చెప్పి ఆ మహిళ భర్తని బ్లాక్మెయిల్ చేసింది.ఆ తర్వాత ఆశా జోయిస్ అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె పార్వతి ప్రైవేట్ వీడియోలను కొంతమంది పార్వతి సన్నిహితులకు పంపి బెదిరించింది. దాంతో పార్వతి బెంగళూరులోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో నటి ఆశా జోయిస్ పై ఫిర్యాదు చేసింది.తన ప్రైవేట్ వీడియోలు ఫోటోలు బయటపెట్టి అందరి ముందు నా పరువు తీసేసిందని, గోర అవమానం జరిగిందని, దానికి కారణమైన ఆశా జోయిస్ ని వదలకూడదని,కఠినంగా శిక్షించాలి అంటూ పార్వతి ఆశా పై కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Actress blackmailed with nude videos

అలా పార్వతి ప్రైవేట్ ఫోటోలు బయటికి లీక్ అవ్వకుండా ఉండాలంటే ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందట ఆశా జోయిస్. అలా డబ్బులు ఇవ్వకపోవడంతో పార్వతి సన్నిహితులకు ఆమె ఫోటోలు పంపి పరువు తీసిందట.ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో చాలామంది ఆశా జోయిస్ వ్యక్తిత్వాన్ని ఛీ కొడుతున్నారు.. అసలు నువ్వు ఆడదానివేనా.. మరో ఆడదాన్ని మానాన్ని ఫణంగా పెట్టి డబ్బులు సంపాదిస్తావా అంటూ మండి పడుతున్నారు.(Actress)