

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డ గులాబీ పార్టీ ఓడిపోయింది. అటు చాలా తెలివిగా వ్యూహరచనలు రచించిన రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 24 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. Congress
Jubilee Hills victory Babu enters the fray, 10 more MLAs join Congress
ఈ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చింది. దీంతో పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారట రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో గెలిచిన గులాబీ పార్టీ నేతలపై కన్నేశారట. అలాగే గతంలో టిడిపి పార్టీలో పని చేసిన వారిని కూడా టార్గెట్ చేశారట. Congress
Also Read: Kavitha: రేవంత్ రెడ్డి -కల్వకుంట్ల కవిత కాంబినేషన్ లో బడా కంపెనీ ?
తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీళ్ళందరూ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అందుకే వాళ్లను గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి తీసుకురావాలని ఈ స్కెచ్ వేశారట. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. Congress
Also Read: Vangaveeti Ranga: వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ?






