ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం వార్ 2 రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున్న అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే బుక్ మై షో డాటా ప్రకారం 7,58,000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నుంచి ఇంట్రెస్ట్ ఇంప్రెషన్‌ను దక్కించుకుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ లో 750K మార్కును దాటటం రికార్డ్.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కూలీ మూవీ భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించింది. అయితే.. ఎప్పుడైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అప్పటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ లో స్పీడు అందుకుంది. ఖచ్చితంగా వార్ 2 ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.





