నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ మజిలీ అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి సినిమా చేయలేదు. రీసెంట్ గా ఓ మూవీకి ప్లాన్ చేస్తే, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ ప్రాజెక్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లింది. డీటెయిల్స్ చూస్తే.నాగచైతన్యతో లవ్ స్టోరీ కాకుండా యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నాడట శివ నిర్వాణ.
తను రాసిన స్టోరీ లైన్ చెబితే కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడట నాగ చైతన్య. తనను వెయిటింగ్ లో పెట్టడం, ఇప్పుడు స్టోరీలో మార్పులు చెప్పడంతో ఇదే కథను రవితేజ దగ్గరకు తీసుకెళ్లాడు శివ నిర్వాణ. రవితేజ ఈ కథ ఓకే చేయడంతో వీరి కాంబోలో ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కథలో మార్పులు చెబితే హీరోనే మార్చేసిన శివ నిర్వాణ టాపిక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.





