ట్రోల్స్ కు ఛాన్స్ ఇవ్వని వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వీరమల్లుపై వచ్చిన కంప్లైంట్ సీజీ వర్క్ గురించి. సీజీ వర్క్ క్వాలిటీగా లేదని, కొన్ని సీన్స్ అయితే నవ్వులపాలు అయ్యేలా ఉన్నాయనేే విమర్శలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ సందర్భంగా టీమ్ ఈ జాగ్రత్తలు తీసుకుంది.

పవన్ గుర్రంపై వస్తున్న ఓ సీన్ ను ప్రైమ్ స్ట్రీమింగ్ లో లేకుండా తీసేశారు. దీంతో అనవసర ట్రోల్స్ నుంచి వీరమల్లు తప్పించుకున్నట్లయింది. థియేటర్స్ లో ప్రారంభంలో బాగానే క్రేజ్ తెచ్చుకున్న హరి హర వీరమల్లు సినిమా లాంగ్ రన్ లో నిలబడలేకపోయింది. ఈ సినిమా కొని నష్టపోయామంటూ ఇప్పుడు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఫిలింఛాంబర్ ను అప్రోచ్ అవుతున్నారు. తమకు వచ్చిన నష్టాల్లో కొంత తిరిగి ఇప్పించమని కోరుతున్నారు.

Share your love