ఆకట్టుకుంటున్న కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్

తెలుగు, తమిళ చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య థాపర్. ఆమె నటిస్తున్న మరో క్రేజీ మూవీ నేను రెడీ. ఈ చిత్రంలో హీరో హవీశ్ కు జోడీగా కావ్య థాపర్ కనిపించనుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా తను కోరుకున్న గుర్తింపు తీసుకొస్తుందని ఈ యంగ్ హీరోయిన్ ఆశిస్తోంది.

దర్శకుడు నక్కిన త్రినాథరావు నేను రెడీ చిత్రాన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గారూపొందిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన “నేను రెడీ” టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత కాన్ఫిడెంట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు మూవీ టీమ్.

Share your love