బాలీవుడ్ లో హేరా ఫేరీ, గరమ్ మసాలా, భూల్ భులయ్యా వంటి సూపర్ హిట్ మూవీస్ డైరెక్ట్ చేసిన దర్శకుడు ప్రియదర్శన్ కొంత గ్యాప్ తర్వాత హిందీలో రూపొందిస్తున్న కొత్త సినిమా “హైవాన్”. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ తో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్.
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. కోచిలో ఈ సినిమా ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. ఊటీ, ముంబైలలో ఈ సినిమా షూటింగ్ జరపనున్నారు. సరికొత్త థ్రిల్లర్ కథతో “హైవాన్” సినిమాను రూపొందిస్తున్నారు ప్రియదర్శన్. 17 ఏళ్ల తర్వాత అక్షయ్, సైఫ్ కలిసి నటిస్తున్న చిత్రమిది.





