“దేవర 2” – ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవరకు సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య దేవర 2 ఉండదని ప్రచారం జరిగింది. కానీ దేవర 2కు వర్క్స్ జరుగుతున్నాయి అనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కు దేవర 2 ఫుల్ స్ర్కిప్ట్ వినిపించారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే దేవర 2 ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్లాప్ అవ్వడంతో విదేశాలకు వెళ్లిపోయారు. వచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. సెప్టెంబర్ లో డ్రాగన్ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

Share your love