ఆహా ఓటీటీ “ఇండియన్ ఐడల్ సీజన్ 4” గ్రాండ్ లాంఛ్

ఆహా ఓటీటీ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంఛింగ్ ఈవెంట్ బిగ్ బుల్ లో ఘనంగా జరిగింది. జడ్జిలు తమన్, కార్తీక్, గీతా మాధురి, హోస్ట్స్ సమీర, శ్రీరామ చంద్ర ఈ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని పర్ ఫార్మ్ చేశారు.

తమన్ ఇండియన్ ఐడల్ క్యాంపేన్ సాంగ్ ను ఈ సందర్భంగా అఫీషియల్ గా లాంఛ్ చేశారు. సింగర్ కార్తీక్ ఈ కార్యక్రమం కోసం గల్లీ టు గ్లోబల్, మనమే రా ఐడల్ అనే థీమ్ ను ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ లో ఇండియన్ ఐడల్ షోకు సంబంధించిన వీడియోస్, మెమొరీస్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సీజన్ మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో వ్యూయర్స్ కు నెవర్ బిఫోర్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుందని జడ్జీలు, హోస్ట్ లు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

Share your love