ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దాంతో దేవరకు ఓ మోస్తరు కలెక్షన్స్ దక్కాయి. వార్ 2 ఆఫర్ కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ తో వచ్చిందే. ఇందులో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ నటించారు. వార్ 2 సినిమా పై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో ఈ సినిమా మరింత క్రేజ్ తీసుకువస్తుందని బలంగా నమ్మాడు. ఎన్టీఆర్ సోలో హీరోగా హిందీ మూవీకి సన్నాహాలు జరిగాయి.
అయితే వార్ 2 ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సౌత్ లో అయినా అదరగొట్టేస్తుంది అనుకుంటే.. ఇక్కడ కూడా అంతే. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లో సోలో హీరోగా సినిమా లేనట్టే అనే వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే.. ఇప్పట్లో ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ చేయాలి అనుకోవడం లేదట. ఫోకస్ అంతా ఇక్కడే పెట్టాలని ఫిక్స్ అయ్యాడట. తెలుగు సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్, త్రివిక్రమ్ తో ఓ సినిమా, కొరటాలతో దేవర2 చేస్తున్నారు.





