
Tablets: చాలామంది వ్యాధులు వచ్చిన సమయంలో టాబ్లెట్లు వేసుకుంటారు. ఇక కొంతమంది ట్యాబ్లెట్ల పరిమాణం పెద్దగా ఉందని విరిచి రెండు ముక్కలు చేసుకొని వేసుకుంటారు. అయితే స్కోర్ లైన్ లేని టాబ్లెట్లను అస్సలు విరిచి వేసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సూచనలు లేకుండా ఏ టాబ్లెట్లను కూడా విరిచి వేసుకోవద్దని చెబుతున్నారు. ఒకవేళ టాబ్లెట్లను విరిస్తే దాని పనితీరు పూర్తిగా దెబ్బ తింటుందట. అంతేకాకుండా అలాంటి టాబ్లెట్లను విరిచి వేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతున్నారు. స్కోర్ లైన్ లేని టాబ్లెట్లను విరిచి వేసుకున్నట్లయితే డ్రగ్ రక్తంలో ఒకేసారి ఎక్కువగా రిలీజ్ అయ్యి డోస్ పరిమాణం పెరుగుతుంది. దానివల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.
Also Read: Gold prices: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. భవిష్యత్ లో మరింతగా పెరిగే సూచన!!
Are you crushing the tablets
కడుపులో ఇరిటేషన్ మంట లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చాలావరకు వైద్యులు టాబ్లెట్లను విరిచి వేసుకోమని చెప్పరు. వైద్యులు చెబితేనే ఇలా వేయాలి లేకపోతే అస్సలు వేయకూడదు. టాబ్లెట్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ అలానే వేసుకోవాలి. లేదంటే నీటిలో కరగబెట్టి ఆ నీటిని తాగాలి. అంతేకానీ డాక్టర్ల సూచనలు లేకుండా మాత్రం స్కోర్ లైన్ లేని టాబ్లెట్లను విరిచి వేసుకోకూడదు. ఇక వర్షాకాలం కావడంతో చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా చాలా మంది దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు.
Also Read: Extramarital Affairs: విపరీతంగా పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. అదే ప్రధాన కారణం!!
వాతావరణంలో అనేక రకాల మార్పుల కారణంగా వ్యాధులు తొందరగా అంటుకుంటాయి. అందువల్ల చిన్న పిల్లలు, వృద్దులు బయట తిరగకూడదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. బయటి ఆహారాన్ని తినడం పూర్తిగా మానేయాలని చెబుతున్నారు. కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల వ్యాధులు తొందరగా వస్తాయి. అంతేకాకుండా బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ పైన అనేక రకాల క్రీములు పడతాయి. అలాంటి ఆహారాన్ని తిన్నట్లయితే తొందరగా వైరల్ ఇన్ఫెక్షన్లు అంటుకుంటాయి. వీలైనంతవరకు బయట ఆహారాన్ని తినకపోవడమే మంచిదని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
Also Read: vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న వెజిటేరియన్స్!!




















