Chiranjeevi: అమ్మని చూస్తే నాన్నకు వణుకు.. చిరంజీవి పరువు తీసిన సుస్మిత.!

Sushmita insults Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈయనను చూస్తే నటననే వణికి పోతుందని చెప్పవచ్చు. అలా సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి క్యారెక్టర్లో అయినా నటించడం కాదు జీవించేస్తారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా మారారు.. ఆయన ఇండస్ట్రీ లో ఎదగడమే కాకుండా తన ఫ్యామిలీ మొత్తాన్ని ఎదిగేలా చేసిన గొప్ప ధీరుడు అని చెప్పవచ్చు.

Susmita insults Chiranjeevi

అయితే అలాంటి చిరంజీవి బయట ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఆ ఒక్కరికి మాత్రం కాస్త భయపడతారట. అయితే చిరంజీవియే కాదు ఎంత పెద్ద ధనికుడైనా, పెద్ద వ్యాపారవేత్త అయినా సరే ఆ ఒక్కరికి భయపడడం సర్వ సాధారణం. అసలు విషయం లోకి వెళ్తే.. చిరంజీవి ఓ సినిమా షూటింగ్ సమయం లో ఆ మనిషి ఎదురుగా ఉంటే తను వేసే స్టెప్స్, డైలాగ్స్ కూడా మర్చిపోయారట. మరి ఆ సందర్భం ఏంటి ఆ వివరాలు ఎంటో తెలుసుకుందాం..

Also Read: ARC Cinemas: రామ్ చరణ్ కొత్త బిజినెస్.. ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఆ వ్యాపారంలోకి ఎంట్రీ!!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ..సుస్మిత కొణిదెల నిర్మాణ సారధ్యంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తోంది. ఈ సినిమా లో ఒక సాంగ్ షూటింగ్ చేసే సమయం లో సెట్స్ కి చిరంజీవి భార్య సురేఖ వచ్చారట. అయితే ఆమె ఒక దగ్గర కూర్చొని షూటింగ్ జరుగుతుంటే చూస్తున్నారు. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే చిరంజీవి తాను వేసే స్టెప్పులన్నీ మర్చిపోయారని , ఇవన్నీ అమ్మ ముందు కూర్చోవడం వల్లే జరిగాయని సుస్మిత హాస్యాస్పదంగా చెప్పింది. అయితే ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.

Sushmita insults Chiranjeevi

ఇందులో నయనతార హీరోయిన్ గా చేస్తోంది.. అయితే ఈ విషయం గురించి సుస్మిత తాజాగా కిష్కింధపురి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పెట్టింది. ప్రస్తుతం సుస్మిత చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎంత పెద్ద తోపైనా సరే భార్య ముందు తగ్గాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. సీఎం అయినా ఇంట్లోకి వెళ్తే అంతే సంగతులు అంటూ కామెడీగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read:‘మర్యాద రామన్న’ సీక్వెల్ కు ఫ్లాప్ టాక్

Share your love