
Bollywood: ఏంటి ఆ బాలీవుడ్ జంట నిజంగానే షూటింగ్ సెట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని చూస్తారా…ఆ డైరెక్టర్ చేసిన కామెంట్స్ లో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా అంటే తెలియని వారు ఉండరు.అయితే రీసెంట్గా ఆయన ఓ బాలీవుడ్ కపుల్ పై చేసిన కామెంట్లు బీ టౌన్ లో దుమారం సృష్టిస్తున్నాయి.ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో ఉండే ఈ సెలబ్రిటీ కపుల్ ని సినిమా కోసం తీసుకుంటే ఆ నిర్మాత బతుకు బస్టాండే..
Director comments on Bollywood couple
ఇక దక్షిణాదిలో ఉండే ఒక డైరెక్టర్ తన సినిమా కోసం ఒక బాలీవుడ్ హీరోని తీసుకున్నారు. ఇక ఆ నిర్మాత కూడా ఆ హీరో స్టార్డం దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ భారీగానే పెడదాం అనుకున్నారు. కానీ తీరా షూటింగ్ సెట్ కి వచ్చి చూసేసరికి 6 వ్యానిటీ వ్యాన్లు ఉన్నాయి. అది చూసి ఆశ్చర్యపోయిన ప్రొడ్యూసర్ ఇదేంటి 6 వ్యానిటీ వ్యాన్లు వచ్చాయి అని తెలుసుకోగా ఆ ఒక్క హీరోనే ఆరు వ్యానిటీ వ్యాన్లను మెయింటైన్ చేస్తున్నాడని తెలిసి ఈ హీరోని పెట్టుకుంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది అని సినిమా ఆగిపోయినా పర్వాలేదు అని చెప్పి ఆ హీరోకి మొహం మీదే నువ్వు వద్దు అని చెప్పకుండా షూటింగ్ లొకేషన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి.(Bollywood)
Also Read: Kushboo Patani: హిందువులను అవమానించిన దిశా పటాని సోదరికి చుక్కలు.. ఏకంగా గన్ తో కాల్పులు .!
అది క్లియర్ అయ్యాక మళ్ళీ రండి అని చెప్పడంతో అక్కనుండి ఆ హీరో వెళ్లిపోయాడు. అయితే ఆ హీరో కి ఒక్కరోజే 18 లక్షలు పెడితే తన సినిమా ఎలా ముందుకు వెళుతుంది అని గ్రహించి ఆ నిర్మాత ఈ హీరోని తన సినిమా కోసం వద్దనుకున్నాడు. అయితే బాలీవుడ్ లో ఉండే కొంతమంది హీరోలు ఒక్క సినిమా కోసం ఏకంగా 11 వ్యానిటీ వ్యాన్లు వాడుతారు.అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సెలబ్రిటీ కపుల్ మాత్రం కిచెన్ కోసం ఒక వ్యానిటీ వ్యాన్,తమ ప్రైవేట్ స్పేస్ కోసం మరో వ్యానిటీ వ్యాన్, జిమ్ కోసం ఒకటి, మేకప్ కోసం ఒకటి ఇలా లగ్జరీగా ఉండాలి అనుకుంటారు.ఇక వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ఉన్న వ్యానిటీ వ్యాన్లో బట్టలిప్పి పడుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆ దర్శకుడు టార్గెట్ చేసింది దీపికా పదుకొనే రన్వీర్ సింగ్ లనే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే హనుమాన్ మూవీ వచ్చాక ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస్ అనే సినిమాని రన్వీర్ సింగ్ తో చేస్తున్నట్టు రూమర్లు వినిపించాయి.కానీ సడన్ గా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే రన్వీర్ సింగ్ చేసిన పని వల్లే నిర్మాత బరడ్జెట్ ఎక్కువ అవుతుందని సినిమాని పక్కన పెట్టినట్టు అర్థమవుతుంది ఇక రీసెంట్గా దీపిక పదుకొనే పై సందీప్ రెడ్డి వంగా కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. అందుకే సంజయ్ గుప్తా టార్గెట్ చేసింది దీపిక రన్వీర్ లనే అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.(Bollywood)





