Chandramukhi: చంద్రముఖి మూవీ చూసి ఉ** పోసుకున్న పాన్ ఇండియా డైరెక్టర్.!

Pan India director who was scared after watching the movie Chandramukhi

Chandramukhi: రజినీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా ఇప్పటికీ చాలామంది చూసే ఉంటారు. ఈ సినిమాకి సీక్వెల్ అనే పేరుతో చంద్రముఖి 2 ని కూడా రాఘవ లారెన్స్ చేశారు. కానీ ఈ సినిమా చంద్రముఖి అంతా హిట్ అయితే కాలేదు. అలాగే చంద్రముఖి లాగే నాగవల్లి సినిమా కూడా తెలుగులో విడుదలైంది. కానీ ఇవేవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేదు.అయితే చంద్రముఖి మూవీ మొదట మలయాళంలో మణిచిత్రతళు అనే పేరుతో తెరకెక్కింది.

Pan India director who was scared after watching the movie Chandramukhi

ఆ తర్వాత కన్నడలో ఆప్తమిత్ర తెలుగు, తమిళంలో చంద్రముఖి గా వచ్చింది. అయితే ఈ సినిమాలో చంద్రముఖి దయ్యం పట్టిన హీరోయిన్ కి మానసిక వైద్యుడు ఆ వ్యాధిని ఎలా పోగోడతాడు అనేదాన్ని చూపిస్తారు.అయితే ఈ సినిమా వచ్చిన కొత్తలో చాలామంది సినిమా చూసి భయపడిపోయారు. అందులో ఓ పాన్ ఇండియా డైరెక్టర్ కూడా ఉన్నారు. అవును మీరు వినేది నిజమే త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వబోతున్న బుచ్చిబాబు సనా ఈ సినిమా చూసి చాలా భయపడిపోయారట.(Chandramukhi)

Also Read: Bollywood: బాలీవుడ్ జంటపై డైరెక్టర్ కామెంట్స్.. బట్టలిప్పి పడుకుంటారంటూ.!

చంద్రముఖి సినిమా థియేటర్లో చూసేటప్పుడు బుచ్చిబాబు థియేటర్ కుర్చీలో కాళ్లు పెట్టుకొని భయం భయంగా చూసారట. ఆ తర్వాత థియేటర్ నుండి రాత్రి పూట రూమ్ కి వెళ్లే సమయంలో తన ఫ్రెండ్ ని గది తలుపు తెరిచి ఉంచమని చెప్పారట. అయితే ఫ్రెండ్ డోర్ తెరవకపోవడంతో ఫోన్ చేస్తే అతడి రింగ్టోన్ విని మరింత భయపడ్డారట.

Pan India director who was scared after watching the movie Chandramukhi

ఎందుకంటే ఆయన రింగ్టోన్ చంద్రముఖి మూవీలోని వారాయ్ అని పెట్టుకున్నాడట.ఆ రింగ్టోన్ రావడంతో నేను మరింత భయపడ్డాను నాకే ఎందుకు ఇలాంటివి తగులుతాయి అని అనుకున్నా.. అంటూ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా కిష్కింధపురి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. ఇక బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది అనే పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు.(Chandramukhi)

Share your love