Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ” రచ్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కి అసలు సంబంధం లేదని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని గులాబీ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. పొంగులేటి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని, అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. Ponguleti
Ponguleti Raghava Constructions stir in the Assembly
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాలపై ఆధారాలతో సహా సభ ముందు పెట్టారు హరీష్ రావు. అవన్నీ నిజమేనని రేవంత్, మంత్రులు ఒప్పుకున్నట్లు గులాబీ పార్టీ పేర్కొంటోంది.. వారిపై ఫైన్ విధించామని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పొంగులేటిది కాదని, ఆయన బంధువులది అని రేవంత్ రెడ్డి బుకాయింపులకు దిగాడని అంటున్నారు. Ponguleti
Also Read: KCR: త్వరలోనే కెసిఆర్ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్?
హౌస్ కమిటీకి దొరికిపోతామని.. ప్రభుత్వ పరిధిలోని సీబీసీఐడీ విచారణ ప్రకటించారట రేవంత్. జంపింగ్ ఎమ్మెల్యేలను, దళిత ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ సభ్యులపై ఉసిగొల్పినట్లు రేవంత్ రెడ్డిపై ప్రచారం జోరు అందుకుంది. అటు పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అవినీతిపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఆధారాలతో అడ్డంగా దొరికిపోవడంతో ఇరుక్కుపోయింది కాంగ్రెస్ సర్కారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Ponguleti
Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా



