Mokshagna: మోక్షజ్ఞ అదృష్టాన్ని ఆ హీరో లాగేసుకున్నాడా.. తెర వెనుక ఏం జరిగిందంటే.?

Did that hero snatch the fate of Mokshagna

Mokshagna: నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ కి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారు.తన కొడుకుని ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేయాలని ఇప్పటికే ఎన్నో కథలు విన్న సంగతి మనకు తెలిసిందే. కానీ తాజాగా బాలకృష్ణ గురించి ఒక వైరల్ వార్త వినిపిస్తోంది. అదేంటంటే బాలకృష్ణ తన అజాగ్రత్త కారణంగా మోక్షజ్ఞ కోసం వచ్చిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశారట. అయితే బాలకృష్ణ రిజెక్ట్ చేసిన రెండు సినిమాలు కూడా హిట్ అయ్యి మరో హీరో కి అదృష్టంగా మారాయట.

Did that hero snatch the fate of Mokshagna

మరి ఇంతకీ బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలేంటి.. ఆ సినిమాల వల్ల ఎవరు హీరో అయిపోయారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటయ్యా అంటే ఒకటి తాజాగా వచ్చిన మిరాయ్.. మరొకటి పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హనుమాన్.. అయితే ఈ రెండు సినిమాలు మోక్షజ్ఞ చేయాల్సినవేనట.కానీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో అవి కాస్త తేజ చేతిలోకి వచ్చి ఆయన హీరోగా గుర్తింపు పొందారు. (Mokshagna)

Also Read:Chandramukhi: చంద్రముఖి మూవీ చూసి ఉ** పోసుకున్న పాన్ ఇండియా డైరెక్టర

ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో చేస్తున్న సమయంలో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో హనుమాన్ సినిమా తెరకెక్కిస్తానని చెప్పారట. కానీ ప్రశాంత్ వర్మ అప్పటివరకు చిన్న డైరెక్టర్ కావడంతో తన కొడుకు ఈ చిన్న డైరెక్టర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే ఆ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ప్రశాంత్ వర్మ మీద నమ్మకం పెట్టుకోలేదట. అందుకే హనుమాన్ మూవీని రిజెక్ట్ చేశారట.

Did that hero snatch the fate of Mokshagna

అయితే రీసెంట్ గా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వచ్చిన మిరాయ్ సినిమాకి కూడా మొదట హీరోగా మోక్షజ్ఞని అనుకున్నారట.కానీ బాలకృష్ణ ఈ జానర్ తన కొడుకుకి సెట్ అవ్వదని రిజెక్ట్ చేశారట. ఈ రెండు సినిమాలు మోక్షజ్ఞ కి వచ్చినవే కానీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో అవి కాస్త తేజ చేతుల్లోకి వెళ్లి ఆయన సూపర్ హీరో పాత్రల్లో మెరిసి అద్భుతమైన హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఈ వైరల్ వార్తల్లో ఉన్న నిజమెంతో తెలియాల్సి ఉంది.(Mokshagna)

Share your love