Prabhas:”మా పెళ్లి జరిగితేనే మీ నోర్లు మూతపడతాయి”.. ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్.!

Prabhas sensational comments on marraige

Prabhas: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసేవారు చిన్న వయసులో అస్సలు పెళ్లి చేసుకోరు. ఇప్పటికీ కొంతమంది హీరోలు ఇండస్ట్రీ లో సెట్ అయిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మరి కొంతమంది ఐదు పదుల వయస్సు దగ్గరికి వస్తున్నా పెళ్లి పై మాత్రం ఆసక్తి చూపడం లేదు. కేవలం హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఈయన కెరియర్లో అన్ని విధాలుగా సెట్ అయినా కానీ పెళ్లి విషయంలో మాత్రం వెనకబడిపోయారు.

Prabhas sensational comments on marraige

ఈయన ఓకే అంటే ప్రపంచంలోని ఎంతోమంది సుందరిమణులు క్యూ కట్టి మరీ ఆయనను పెళ్లి చేసుకోవడానికి పోటీ పడతారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ విషయంలో కాస్త వెనుకబడి పోతున్నారు. కానీ ఆయన నిజ జీవితంలో పెళ్లి చేసుకోకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు పెళ్లి జరుగుతుంది. అయితే ప్రభాస్ మరియు అనుష్క మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నందువల్లే పెళ్లిళ్లు చేసుకోవడం లేదు అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరి పెయిర్ చాలా బాగుంటుందని, పెళ్లి చేసుకొని ఒక్కటైతే అందరూ ఆనందపడతారని అభిమానులు అనుకుంటున్నారు.(Prabhas)

Also Read: Mokshagna: మోక్షజ్ఞ అదృష్టాన్ని ఆ హీరో లాగేసుకున్నాడా.. తెర వెనుక ఏం జరిగిందంటే.?

అయితే నిజంగానే ప్రభాస్ అనుష్క ల మధ్య లవ్ ఉందా అనే విషయంపై ప్రభాస్ ఆ మధ్యకాలంలోనే క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రస్తుతం ఏఐ నడుస్తున్న తరుణంలో వీరిద్దరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నట్లు ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ అప్పట్లో అన్న ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రూమర్స్ ఆగాలి అంటే మా ఇద్దరికీ పెళ్లి కావాలి అంటూ చెప్పుకొచ్చారు.

Prabhas sensational comments on marraige

అంటే ఆయన అనుష్కను పెళ్లి చేసుకోవడానికి కూడా ఓ విధంగా మొగ్గుచూపినట్టే అనిపిస్తోంది. కానీ మా ఇద్దరిలో ఎవరో ఒక్కరికి పెళ్లి జరిగితే గాని ఈ వార్తలు ఆగవు అన్నట్లుగా మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ అనుష్క తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుండని అభిమానులు కల్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.(Prabhas)

Share your love