Chanakya Niti: మహిళల్లో ఈ లక్షణాలు ఉంటె ప్రమాదమే !

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడు గొప్ప పండితుడు, వక్త. ఆచార్య చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు, భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగం, స్నేహం గురించి తన నీతి శాస్త్రంలో ఎంతో చక్కగా వెల్లడించాడు. ఇక ఒక స్త్రీ ఏ విధంగా ఉంటే ఆ ఇంటికి అదృష్టం వరిస్తుందో కూడా వివరించాడు. ఒక స్త్రీలో ఉండే లక్షణాలు ఆమెను మహారాణిని లేదా బిచ్చగాడిలా మార్చుతుందని వెల్లడించాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం… మంచి లక్షణాలు ఉన్న స్త్రీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని చెప్పాడు. అలాగే చెడు అలవాట్లు ఉన్న స్త్రీ ఆ ఇంటికి నరకాన్ని, కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తుందని వెల్లడించాడు. Chanakya Niti

Chanakya Niti These symptoms are dangerous in women

ఆచార్య చాణక్య నీతి ప్రకారం కష్టపడి పనిచేసే ప్రతి మహిళ తమ సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతుంది. ఆమె ఇంటికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా జీవితంలో పురోగతి సాధిస్తుంది. అదే విధంగా ఏ మహిళా అయితే పొదుపును అలవాటు చేసుకుంటుందో ఆ మహిళ చాలా గొప్పది. పొదుపు చేసే మహిళ ఇంటిని ఎప్పుడు అప్పుల్లో కూరుకుపోకుండా చేస్తుంది. తెలివిగా ప్రవర్తిస్తుంది. ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం ఏ స్త్రీకి అయితే ఓపిక ఎక్కువగా ఉంటుందో కోపాన్ని అదుపులో పెట్టుకుంటుందో ఆమె ఇంటిని కాపాడడంలో ముందు వరుసలో నిలుస్తుంది.

Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

ఏ స్త్రీ అయితే ఇంట్లో పెద్దలను, భర్తను గౌరవిస్తుందో ఆ ఇంట్లో శాంతి, సంతోషం, సంపద, గౌరవం అధికంగా ఉంటాయి. భర్తతో ఎప్పుడూ గొడవకు దిగని స్త్రీ ఆ ఇంటిని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. దేవుని పట్ల భక్తితో ఉన్న స్త్రీ ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలను తీసుకువస్తుంది. భక్తితో దేవుడిని కోరికలు కోరుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఎల్లప్పుడూ పూజలు, వ్రతాలు చేసినట్లయితే ఆ ఇంట్లో సకల దేవతలు వచ్చి కూర్చుంటాయి. దేవుళ్లను గౌరవించే స్త్రీ ఇంటికి ఎప్పుడు మంచి కలిగేలా చూస్తుంది.

Also Read: Ridge Gourd: బీరకాయ ప్రతిరోజు తింటున్నారా..అయితే ఒక్కరిసారి ఇవి తెలుసుకోండి?