
Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఉపఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో… ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేస్తోంది. అటు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలని గులాబీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
Shock for KTR PJR’s son joins Kalvakuntla Kavitha’s party
అయితే ఈ గ్యాప్ లో… గ్రాండ్ విక్టరీ కొట్టాలని కల్వకుంట్ల కవిత ప్లాన్ చేస్తున్నారట. ఈ ఉప ఎన్నికల్లో తానే స్వయంగా పోటీ చేయాలని… కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని తాజాగా కల్వకుంట్ల కవిత కలిశారు.
Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్టరీ ?
వీళ్లిద్దరి మధ్య దాదాపు గంట పాటు సమావేశం జరిగింది. తాను పోటీ చేస్తే సపోర్ట్ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డిని కల్వకుంట్ల కవిత కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనికి విష్ణువర్ధన్ రెడ్డి ఒప్పుకోలేదని సమాచారం. తన ప్రయాణం మొత్తం కేటీఆర్ తోనే ఉంటుందని.. వెల్లడించారట విష్ణువర్ధన్ రెడ్డి. మరి దీనిపై కల్వకుంట్ల కవిత ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?




















