Shivam Dube: అతడు జట్టులో ఉంటే అన్ని విజయాలే… 32 మ్యాచ్ లలో టీమిండియా విక్టరీ?

Shivam Dube: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ప్రస్తుతం టీమిండియా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా నేరుగా సూపర్ ఫోర్క్ వెళ్ళింది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ జట్టును దుబాయ్ వేదికగా చిత్తు చేసి ప్రతి కారం తీర్చుకుంది. Shivam Dube

Also Read: Kavitha: కేటీఆర్ కు షాక్… కల్వకుంట్ల కవిత పార్టీలోకి పీజేఆర్ కొడుకు ?

Great Shivam Dube stands tall with a record 32-match unbeaten streak in T20Is

ఇప్పటికే సూపర్ ఫోర్ కు టీమిండియా చేరడంతో టైటిల్ కూడా కచ్చితంగా టీమిండియా కు వస్తుందని.. అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు ఉన్న ప్రతి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తుంది.

Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

అలా ఇప్పటివరకు 30 మ్యాచ్లలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండంటే రెండు మ్యాచ్ల్లోనే ఫలితం రాలేదు. అంటే వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు అయిందన్న మాట. అంటే ఓవరాల్ గా 32 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినట్టే లెక్క. దీంతో టీమిండియా కు లక్కీ ప్లేయర్గా శివం దుబే మారినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?