Pani Puri: పానీ పూరి తింటున్నారా అయితే జాగ్రత్త…!

Pani Puri

Pani Puri: సాయంత్రం అయిందంటే చాలు చాలామంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఇంట్లో ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నప్పటికీ వాటిని తిన్నా కూడా బయట ఏదో ఒకటి తింటే కానీ మనసు కుదుటపడదు. చాలామంది సాయంత్రం పూట బయట బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్స్, పానీపూరి అధికంగా తింటారు. అయితే బయటి ఆహారం తినకూడదని దానివల్ల ఆరోగ్యానికి అసలు మంచిది కాదని వైద్యులు ఎన్నో రకాల సూచనలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ చాలా మంది ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బయటి ఆహారాన్ని అధికంగా తింటూ ఉంటారు.

Health Issues With Pani Puri

బయటి ఆహారం మీద కలుషితమైన వ్యర్థ పదార్థాలు, బ్యాక్టీరియా వ్యాపించి ఎన్నో రకాల వ్యాధులు ఏర్పడతాయి. ముఖ్యంగా బయట డ్రైనేజీల పక్కన జంక్ ఫుడ్ అధికంగా అమ్ముతారు. అలాంటి ప్రదేశాలలో జంక్ ఫుడ్ అమ్మడం వల్ల ఆహారం పైన అనేక రకాల క్రిములు ఏర్పడతాయి. దానిని తిన్నట్లయితే చెప్పలేనన్ని వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా యువత పానీపూరీలను అధికంగా తింటారు. పానీ పూరి అంటే చాలామందికి ఎంతగానో ఇష్టం. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పానీ పూరిలో బటాని కూర చారు వేసి ఇవ్వడం వల్ల ఇది ఎంతో రుచిని ఇస్తుంది. చాలామంది వీటిని రెండు మూడు ప్లేట్లు అలానే లాగించేస్తారు. చాలా సందర్భాలలో పానీపూరీలను తినడం వల్ల అనేక రకాల వ్యాధులు ఏర్పడుతున్నాయని వైద్యుల నివేదికలో వెళ్లడైంది. అయినప్పటికీ ఏమాత్రం దీనిని పట్టించుకోకుండా చాలా మంది వీటిని తింటూనే ఉంటారు. పానీపూరి వల్ల ఎంతో మంది వ్యాధుల బారిన పడ్డారు. ప్రమాదకరమైన వ్యాధులను కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ యువకుడు పానీపూరి తిని ఆసుపత్రి పాలయ్యాడు.

Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

తన ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఎంతగానో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అతని వ్యాధి తీవ్రత అధికంగా పెరగడంతో ఉద్యోగానికి కూడా దూరమయ్యాడు. పానీ పూరి తిన్న వెంటనే అతని కళ్ళు పూర్తిగా పసుపుపచ్చగా మారి వికారం, వాంతులు, నీరసం ఏర్పడి ఆసుపత్రికి వెళ్లారట. అనంతరం వైద్యులు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసి హైపటైటిస్-ఎ తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పారట. అంతేకాకుండా కాలేయంలోని ఎంజైమ్ లు పెరిగాయని యాంటీ హెచ్ ఏవి, ఐజిఎం, యాంటీ బాడీలు పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు పేర్కొన్నారట. అనంతరం అతనికి సోకిన ప్రమాదకరమైన వ్యాధులకు చికిత్స అందించడంతో అతడు చాలా రోజుల తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని బాధితుడి తల్లిదండ్రులు వెల్లడించారు.

Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu