Sleeping Pills: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా…అయితే ప్రమాదమే ?

Sleeping Pills: నిద్ర పట్టేందుకు కొంతమంది నిద్ర మాత్రలు వాడుతూ ఉంటారు. అయితే నిద్ర మాత్రలు వాడకూడదని చాలామంది వైద్యులు చెబుతూనే ఉంటారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే నిద్ర మాత్రలను మెడికల్ ఏజెన్సీ వారు ఇస్తారు. ఇక కొంతమంది దొంగ చాటుగా డబ్బులు ఎక్కువ ఇస్తామని ఆశ చూపి స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు. నిద్ర మాత్రలు ఎక్కువగా వాడినట్లయితే ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది నిద్ర పట్టక నిద్ర మాత్రలు వాడుతూ ఉంటారు. ఇంట్లో ఎక్కువగా ముసలివారు నిద్ర పట్టడం లేదని వీటిని వేసుకుంటూ ఉంటారు. నేటి కాలంలో చాలామంది ఫోన్లకు అలవాటు పడిపోయి నిద్రను కోల్పోతున్నారు.

sleeping pills side effects

అలాంటి వారు స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా వాడుతున్నారని సర్వేలో వెళ్లడైంది. ఈ నేపథ్యంలోనే నిద్ర మాత్రలు వాడినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రమాత్రలు ఎక్కువగా వాడడం వల్ల జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోతాము. అంతేకాకుండా తల తిరగడం, కంటిచూపు కోల్పోవడం లాంటి సమస్యలు నెలకొంటాయి. నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల టెన్షన్, ఆందోళన, మనసు నిలకడగా ఉండకపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఎప్పుడు శరీరం అంతా మొద్దు బారినట్టు ఉంటుంది. యాక్టివ్ గా ఉండలేక పోతారు. ఇతరులతో సరిగ్గా మాట్లాడలేకపోతారు.

Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?

నిద్ర మాత్రలు రెండు రోజులు అదే పనిగా వేసుకున్నట్లయితే శరీరం నిద్ర మాత్రలకు అడిక్ట్ అయిపోతుందని వైద్యులు చెబుతున్నారు. రెండు రోజులు వీటిని అదే పనిగా వేసుకున్నట్లయితే నిద్ర మాత్రలకు బానిసలు అవుతారని దాని డోస్ మరింతగా పెంచే పరిస్థితులు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలైనంతవరకు నిద్ర మాత్రలు వేసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. వీటిని అధికంగా వేసుకున్నట్లయితే ప్రమాదం బారిన పడతామని చెబుతున్నారు. ఇంట్లో నిద్ర మాత్రలు ఉన్నట్లయితే వాటిని చిన్న పిల్లలకు దూరంగా పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ చిన్న పిల్లలు వాటిని తెలియక నోట్లో వేసుకున్నట్లయితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. వీలైనంత వరకు నిద్ర మాత్రలను చిన్నపిల్లలకు దూరంగా పెట్టాలి.

Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?