
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది (Peddi)’ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రాబోయే షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తో పాటు ప్రత్యేకమైన song షూట్ చేయబోతున్నారని సమాచారం. ముఖ్యంగా, రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడని తెలిసి అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.
Peddi Film Shooting Schedule Updates
ఈ షెడ్యూల్ లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండో పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటి వరకు చరణ్ చేసిన సినిమాలతో పోలిస్తే, Peddi చాలా విభిన్నంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు రాసిన స్క్రిప్ట్ చాలా భిన్నంగా, రియలిస్టిక్ టచ్ తో ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), జగపతి బాబు (Jagapathi Babu), దివ్యేంద్రు శర్మ (Divyenndu Sharma) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో, cricket backdrop తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘పెద్ది’ మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాకుండా, ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్. రెహమాన్ (A R Rahman) సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





