Amavasya 2025: అమావాస్య రోజున ఈ పనులు చేయకండి.. సంకనాకి పోవడం గ్యారెంటీ .!

Amavasya 2025: అమావాస్యకు హిందూ మతంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రికి విశిష్టమైన ప్రాధాన్యత నెలకొంటుంది. ఈ రోజున పూర్వీకులను గౌరవించి వారి ఆశీర్వాదాలను పొందడానికి చాలామంది ఇళ్లలో పూజలు నిర్వహిస్తారు. అయితే కొన్ని పురాణల విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులను చేయడం మానుకోవాలి. ఒకవేళ పొరపాటున కూడా ఇలాంటి పనులను చేసినట్లయితే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అమావాస్య రోజున ఎలాంటి పనులను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజున పొరపాటున కూడా మాంసం తినకూడదు. మద్యం సేవించకూడదు. Amavasya 2025

Don’t do these things on a new moon day You’re guaranteed to get into trouble Amavasya 2025

అమావాస్య రోజున మాంసం, మద్యం కొనడం వల్ల ఇంట్లో నష్టాలు ఏర్పడతాయి. ఈరోజు మాంసాహారం తిన్నట్లయితే కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఇది ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దెబ్బతిస్తుంది. అమావాస్య రోజున మాంసాహారం తిన్నట్లయితే శని వల్ల కలిగే బాధలను ఇబ్బందులను తట్టుకోవడం చాలా కష్టం. అమావాస్య రోజున గోళ్లు, జుట్టు అసలు కత్తిరించకూడదు. పొరపాటున కూడా గోళ్లు, జుట్టు కత్తిరించినట్లయితే పితృ దోషం కలుగుతుంది. అమావాస్య రోజున తల స్నానం చేయడం కూడా అనేక రకాల సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా అమావాస్య రోజున చీపురు కొనవద్దు. అమావాస్య రోజున పితృదేవతలకు అంకితం చేయబడినది. ఈరోజు శని దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. Amavasya 2025

Also Read: OG Movie: దర్శకుడు సుజీత్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్…స్టేజి పైనే ?

చీపురు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుందని ధర్మశాస్త్రాలు చెబుతూనే ఉంటాయి. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపిరి కోన్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇది డబ్బు ప్రవాహాన్ని పూర్తిగా ఆపివేస్తోంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అనారోగ్యం సంభవిస్తుంది. అమావాస్య రోజున తలకి నూనె అస్సలు రాసుకోకూడదు. దానికి బదులుగా నూనె దానం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. నూనె శని దేవునితో ముడిపడి ఉంటుంది. ఇది కుండలి నుండి శని దోషాన్ని తొలగించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. పొరపాటున కూడా అమావాస్య రోజున జుట్టుకు నూనె రాసుకోకూడదు. ఇక అమావాస్య రోజున ఇతర ఊర్లకు వెళ్లకూడదు. ప్రయాణాలు అసలు చేయకూడదు. కొత్త దుస్తులను ధరించకూడదు. ఎలాంటి కొత్త పనులను ప్రారంభించకూడదు.

Also Read: IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?

Share your love