
Baby: 2023 లో వచ్చిన బేబీ మూవీ దేశవ్యాప్తంగా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే అలాంటి ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ తో పాటు మరో నటుడు కూడా కీరోల్ పోషించారు ఆయనే విరాజ్ అశ్విన్.. ఇక ఇందులో హీరోయిన్ రోల్ కీలకం.ఇందులో హీరోయిన్ గా తెలుగు నటి వైష్ణవి చైతన్య చేసింది. అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన హిట్ సాధించింది.. ఈ సినిమా చూశాక చాలామంది ట్రూ లవర్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆడదాని చేతిలో మోసపోయిన ఎంతోమంది బేబీ సినిమా చూసి థియేటర్లో కన్నీరు పెట్టుకున్న వీడియోలు మనం చూసాం.
Baby hero gets caught romancing a Marathi beauty in a pub
అలా సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఆ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.. అయితే అలాంటి ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ తో పాటు విరాజ్ అశ్విన్ కూడా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ రిచ్ అబ్బాయిగా కనిపిస్తాడు.అలా ఈ సినిమాతో ఫేమస్ అయిన విరాజ్ అశ్విన్ కి సంబంధించి తాజాగా ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. విరాజ్ అశ్విన్ ఓ అమ్మాయితో పబ్ లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఆ అమ్మాయితో విరాజ్ అశ్విన్ రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ విరాజ్ అశ్విన్ రొమాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరు.. వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..(Baby)
Also Read: OG Movie: “ఓజి” కోసం మిరాయ్ కి అన్యాయం.. థియేటర్లు లాగేసుకున్నారు ?
తాజాగా విరాజ్ అశ్విన్ హైదరాబాదులోని ఓ పబ్ లో జంటగా కనిపించాడు. అయితే విరాజ్ అశ్విన్ తో ఉన్న ఆ అమ్మాయి మరాఠా సోషల్ మీడియా స్టార్ యశ శ్రీ అని తెలుస్తోంది.. యశ శ్రీ తో కలిసి విరాజ్ అశ్విన్ పబ్ లో డ్రింక్ చేస్తూ కనిపించారు. ఇక వీరిద్దరు రాత్రంతా హైదరాబాద్ పబ్ లోనే ఫుల్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.. అయితే ఆ సోషల్ మీడియా స్టార్ తో విరాజ్ అశ్విన్ కి సంబంధం ఏంటి అని ఈ వీడియో చూశాక చాలామందికి అనుమానం కలుగుతుంది. అయితే సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. విరాజ్ అశ్విన్ యశ శ్రీ ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాదు త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది.అందుకే ఇలా అఫీషియల్ గా పబ్బులు, పార్టీలు అంటూ తిరుగుతూ చక్కర్లు కొడుతున్నారని సమాచారం.. అలా ఫైనల్ గా బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ పెళ్లికి రెడీ అయినట్టు వార్తలు రావడంతో చాలామంది నెటిజన్స్ ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక విరాజ్ అశ్విన్ బేబీ మూవీ తో ఫేమస్ అయినప్పటికీ అంతకుముందే అనగనగా ఓ ప్రేమ కథ, ధన్యవాదాలు సోదరా, మాయాపేటిక వంటి సినిమాలు చేశారు. ఇక బేబీ మూవీ తో స్టార్ట్ డం రావడంతో హాయ్ నాన్న, జోరుగా హుషారుగా, శ్రీరంగనీతులు వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.(Baby)





