
OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి పడుతున్నారు. OG సినిమా ప్రీమియర్ షో టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతోందట దిల్ రాజు మాఫియా. మల్టీప్లెక్స్ టికెట్లయితే 800కు అమ్మవలసి వస్తుందని ముందుగా సింగిల్ స్క్రీన్స్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముడు పోయేలా ప్లాన్ చేస్తున్నారట. FDC చైర్మన్‌గా ఉంటూ రూ.800 రూపాయలకు టికెట్ అమ్మాలన్న ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి ఒక్కో టికెట్ రూ.2000 వేల కంటే ఎక్కువకు అమ్ముకున్నారట దిల్ రాజు. OG Movie
Producer Dil Raju Kakkurti for money OG ticket Rs.2000
సుదర్శన్ 35MM, దేవి, విశ్వనాథ్, శ్రీరాములు కేవలం నాలుగు థియేటర్ల టికెట్లను దాదాపు రూ.2000 రేట్ల మార్జిన్‌తో రూ.1 కోటికి అమ్మినట్లు దిల్ రాజుపై ఆరోపణలు వస్తున్నాయి. OG టికెట్లను బ్లాక్ చేసి, రేట్లను మరింత పెంచి రూ.3000-4000కు అమ్ముతున్నారట బయ్యర్లు. బ్లాక్ టికెట్ల దందాపై, దిల్ రాజు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !
ఈ ఆఫ్‌లైన్ అమ్మకాలను చూసి ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టకుండా అధిక ధరలకు అమ్ముతున్నారు వేరే థియేటర్ యజమానులు. సింగిల్ స్క్రీన్స్ టికెట్స్ బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముడుపోయిన తరువాతే, రేపు మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో మల్టీప్లెక్స్‌ల టిక్కెట్లు పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది. బ్లాక్‌లో అధిక ధరలకు టిక్కెట్లు అమ్మడంతో తమ అభిమాన హీరో సినిమా ప్రీమియర్ షోలు చూడలేకపోతున్నామంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 13-year-old Afghan boy: విమానం బొక్కల్లో దూరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన కుర్రాడు





