
IND VS PAK ASIA CUP 2025 Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ కంటే ముందు టీమిండియా కు ఊహించని షాక్ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. IND VS PAK ASIA CUP 2025 Final
IND VS PAK ASIA CUP 2025 Final
టీమిడియా డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా…. గాయాల పాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే నిన్న శ్రీలంకపై ఒకే ఒక ఓవర్ వేశాడు హార్థిక్ పాండ్యా. అటు అభిషేక్ శర్మ కూడా సూపర్ ఓవర్ సమయంలో బ్యాటింగ్కు దిగలేదు. అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ ఫినిష్ చేశాడు.
Also Read: Balayya: బాలయ్య అఖండ సక్సెస్ వెనుక జగన్… పేర్నినాని సంచలనం !
వాళ్ళిద్దరూ టీమిండియాలో కీలకంగా ఉన్న ప్లేయర్లు. అయితే అభిషేక్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా రేపటి ఫైనల్ మ్యాచ్లో ఆడకపోతే టీమిండియా కష్టాల పాలు కావడం గ్యారెంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక ఈ ఇద్దరు నిజంగానే తుది జట్టులో ఆడకపోతే జితేష్ శర్మ అలాగే శివం దుబే రంగంలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. జితేష్ శర్మ లేదా.. రింకు సింగ్ ను కూడా తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. మరి రేపటి వరకు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!




















