
Boney Kapoor: శ్రీదేవి బోనీ కపూర్ ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే శ్రీదేవి బోనీ కపూర్ ని పెళ్లి చేసుకోకముందే ప్రెగ్నెంట్.. అలా ప్రెగ్నెన్సీ తోనే రహస్యంగా బోనీ కపూర్ ని పెళ్లాడింది. అయితే ఇంత రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం బోనీ కపూర్ కి అంతకుముందే పెళ్లయి పిల్లలు ఉండడం . అయితే వీరి పెళ్లి సమయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. కానీ ఆ రూమర్లన్నింటినీ పటా పంచెలు చేస్తూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనికపూర్ సంచలన విషయాలు బయట పెట్టారు.
Boney Kapoor reveals the truth
బోనికపూర్ ఆ ఇంటర్వ్యూలో శ్రీదేవితో పెళ్లి గురించి మాట్లాడుతూ..నేను నా మొదటి భార్య దగ్గర ఏ విషయాన్నీ దాచలేదు. మోనాకి శ్రీదేవితో ప్రేమ విషయాలు చెప్పాను. అలాగే మేమిద్దరం పెళ్లి చేసుకున్న సమయంలో మోనా కొనిచ్చిన ఉంగరాలనే మార్చుకున్నాం. అంతేకాకుండా నేను శ్రీదేవిని పెళ్లి చేసుకున్న కూడా నా మొదటి భార్య పిల్లలకు నా మీద ద్వేషం విషం నూరిపోయలేదు.ఎప్పుడు ప్రేమతోనే ఉండాలి అని చెప్పేది.(Boney Kapoor)
నా జీవితంలో మోనా ఒక గొప్ప పాత్ర పోషించింది. అలాగే శ్రీదేవి మరణించిన సమయంలో కూడా నా మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలకు మద్దతుగా నిలిచారు. అర్జున్ కపూర్ అంషుల ఇద్దరు జాన్వి కపూర్, ఖుషి కపూర్ లను సొంత చెల్లెళ్లు గానే భావించారు.

ప్రస్తుతం వీరంతా ఒక ఫ్యామిలీ గా కలిసి ఉన్నారు.అయితే నేను మొదట శ్రీదేవిని పెళ్లి చేసుకున్న సమయంలో ఆమె దగ్గరే ఉండేవాడిని.ఆ టైంలో నా కొడుకు అర్జున్ కపూర్ నాకు లేఖ రాశారు.నాన్న నువ్వు ఎందుకు మన ఇంటికి రావడం లేదు అని.. ఆ సమయంలో చాలా బాధపడ్డాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బోనీకపూర్.(Boney Kapoor)





