Naga Babu: మీ అయ్యకు చంద్రబాబు వెన్నుపోటు.. నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు?

Naga Babu: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నందమూరి బాలయ్య ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అనవసరంగా మెగాస్టార్ చిరంజీవిని.. ఆయన కుటుంబాన్ని అసెంబ్లీ వేదికగా గెలిచారు నందమూరి బాలకృష్ణ. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అంటూనే చిరంజీవినీ వాడు వీడు అంటూ సంబోధించారు నందమూరి బాలయ్య. ఇంత మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

Naga Babu counter to balayya over chiranjeevi episode

జనసేన పార్టీ నాయకులు కూడా ఎవరు స్పందించడం లేదు. అందరివాడు లాంటి చిరంజీవి ఇప్పుడు ఎవరు లేనివాడు అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ స్పందించడం లేదు. చలి జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. మీ అయ్యకు మీ బావ చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది గుర్తులేదా..? అయినా కూడా చంద్రబాబు వెంటే తిరుగుతున్నావు సిగ్గు లేదా అన్న రేంజ్ లో నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఇది నీ బ్లడ్ అలాగే నీ బ్రీడ్ అంటూ చురకలు అందించారు నాగబాబు.

Also Read: Balayya: బాల‌య్య అఖండ స‌క్సెస్ వెనుక జ‌గ‌న్… పేర్నినాని సంచ‌ల‌నం !

దీంతో ఈ వీడియోను వైసిపి బాగా వాడుకొని వైరల్ చేస్తోంది. వాస్తవానికి నాగబాబు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవి కావు. 2019 ఫిబ్రవరి 3వ తేదీన మాట్లాడిన మాటలను… ఇప్పుడు వైరల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. చిరంజీవి వర్సెస్ నందమూరి బాలయ్య ఎపిసోడ్ లో మసాలా కలిపిందుకే వైసీపీ ఇలా క్రియేట్ చేసినట్లు కొంతమంది జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని వాడు వీడు అంటే కుటుంబం తరఫున నాగబాబు లేదా పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని మరి కొంతమంది వాదిస్తున్నారు.

Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!

https://www.facebook.com/reel/1147962480761417
Share your love