
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు బాలయ్య. జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అని… మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడు అంటూ సంభోదించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.
Balayya’s defeat to the alliance Pawan Kalyan’s goodbye Journey with YSRCP
అటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు రోడ్ ఎక్కారు. వెంటనే నందమూరి బాలయ్య.. దిగివచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. అటు నందమూరి అభిమానులు మాత్రం సోషల్ మీడియా.. వేదికగా చిరంజీవికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా… టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. దీంతో జనసేన పార్టీ కొత్త అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వార్తలు.
Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!
త్వరలోనే కూటమికి గుడ్ బై చెప్పేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు… పోస్టులు కూడా పెడుతున్నారు కొంతమంది. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారట. ఎన్నో అవమానాలు భరించామని… ఇప్పుడు తన అన్నయ్య పైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ గుర్రు మీద ఉన్నారట. దీంతో… ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
Also Read: Balayya: బాలయ్య అఖండ సక్సెస్ వెనుక జగన్… పేర్నినాని సంచలనం !





