Saif Ali Khan: మహిళా నిర్మాత వేధింపులు.. 1000 రూపాయలు ఇచ్చి కిస్..!

The female producer who harassed Saif Ali Khan

Saif Ali Khan: బాలీవుడ్ ఫేమస్ నటుడు సైఫ్ అలీఖాన్ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం బాలీవుడ్ లోని సీనియర్ హీరోల్లో ఈయన కూడా ఒకరిగా ఉన్నారు. అలాంటి ఆలీ ఖాన్ సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కానీ ఆయన స్టార్ గా ఎదగడానికి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి సైప్ అలీ ఖాన్ తాజాగా ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో ఆ విషయం గురించి చెప్పుకొచ్చారు.

The female producer who harassed Saif Ali Khan

అంతేకాదు ఆయన ఒక మహిళ నిర్మాతపై పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆ మహిళా నిర్మాత తనను ముద్దు పెట్టమని ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. అంతేకాదు తన బుగ్గపై ఒక్క ముద్దు పెడితే వెయ్యి రూపాయలు ఇస్తానని ఆఫర్ కూడా చేసిందని, నా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ పనికి కూడా ఒప్పుకొని తన బుగ్గపై ముద్దు ఇచ్చే వాడినని తెలియజేశారు. (Saif Ali Khan)

Also Read: Vijay: చిన్న తప్పు 40 మందిని పొట్టన పెట్టుకుంది.. ఉసురు తగులుతుందంటూ విజయ్ పై ఫైర్.!

అలా అయిష్టం తోనే ఆమెకు ముద్దులు ఇస్తూ వేయి రూపాయలు తీసుకొని వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు.. ఈ విధంగా ఇండస్ట్రీలో ఆర్థిక బలం ఉన్నా కానీ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. 1990ల్లో కెరీర్ ప్రారంభించిన సైఫ్ అలీ ఖాన్ తొలి దశలో సైడ్ హీరో పాత్రలో నటించారు

The female producer who harassed Saif Ali Khan

కానీ డబ్బు సంపాదించాలంటే కొన్ని అసహ్యకరమైన పనులు చేయాల్సి వచ్చిందని తెలియజేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టెక్కుతూ పెద్ద స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఇటీవల రిలీజ్ అయినటువంటి దేవర, ఆది పురుష్ వంటి చిత్రాల్లో విలన్ గా కూడా చేసి మనందరిని మెప్పించారు.(Saif Ali Khan)

Share your love