Kantara:Chapter 1: ఓజి సినిమా కోసం కాంతార: చాప్టర్ 1 సినిమాపై కుట్రలు.!

Conspiracies over the movie Kantara:Chapter 1 for the OG movie

Kantara:Chapter 1: ఏంటి ఓజి సినిమా కోసం కాంతార చాప్టర్:1 పై కుట్రలు చేస్తున్నారా..సోషల్ మీడియాలో వినిపించే వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా సోషల్ మీడియాలో బాయ్ కట్ కాంతార చాప్టర్ 1 అనే యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. అయితే చాలామంది ఓవర్సీస్ లో తెలుగు హిందీ డబ్బింగ్ లకు ఈ సినిమాకి అంత ఎందుకు పెడుతున్నారు అనే వ్యతిరేకతను తీసుకువస్తున్నారు.

Conspiracies over the movie Kantara:Chapter 1 for the OG movie

కన్నడ సినిమాకి అన్ని డబ్బులు పెట్టడం అవసరమా అన్నట్లుగా దీనిపై వ్యతిరేకత చూపిస్తున్నారు. అంతేకాదు కన్నడ సినిమాలను తెలుగులో ఆదరించడం ఎందుకు మన తెలుగు సినిమాలను కన్నడ వాళ్ళు ఆదరిస్తారా అంటూ మండిపడుతున్నారు.అయితే సోషల్ మీడియాలో ఈ నెగెటివిటీ రావడానికి కారణం వేరే ఉంది అనే టాక్ వినిపిస్తోంది.(Kantara:Chapter 1)

Also Read: Saif Ali Khan: మహిళా నిర్మాత వేధింపులు.. 1000 రూపాయలు ఇచ్చి కిస్..!

అయితే ప్రస్తుతం దసరా బరిలో నిలిచిన ఓజి మూవీకి అడ్డెవరు లేరు ఓజి మూవీ కచ్చితంగా 500 కోట్ల కలెక్షన్స్ అయినా సాధిస్తుంది అని అనుకున్నారు. కానీ సడన్గా కాంతారా చాప్టర్ 1మూవీ అక్టోబర్ 2న విడుదల కావడంతో ఓజి మూవీ కలెక్షన్లకు దెబ్బ పడబోతుంది. ముఖ్యంగా ఓజి సినిమా ఫస్ట్ రెండు రోజులు ఉన్నంత జోరు తర్వాత లేదు. ప్రస్తుతం అందరికీ కాంతార చాప్టర్ వన్ సినిమా పైనే భారీ అంచనాలు ఉన్నాయి.

Conspiracies over the movie Kantara:Chapter 1 for the OG movie

ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ వన్ సినిమా రిలీజ్ అయితే ఓజి సినిమా కలెక్షన్లు పూర్తిగా పడిపోతాయి. అలాగే బయ్యర్లకు నష్టం వస్తుంది అనే ఉద్దేశంతో బాయ్ కట్ కాంతర చాప్టర్ 1 అనే యాష్ ట్యాగ్ ని కొంతమంది కావాలనే వైరల్ చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది.ఇక మరి కొంతమందేమో రిషబ్ శెట్టి ఎన్టీఆర్ ఇద్దరు స్నేహితులు కాబట్టి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారా అనే రూమర్ కూడా వినిపిస్తుంది.(Kantara:Chapter 1)

Share your love