
Dhanashree Verma: ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్, డాక్టర్, మోడల్, ఇన్ఫ్లుయెన్సర్, నటి. కొరియోగ్రాఫర్ గా ధనశ్రీ వర్మ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అనేక సినిమా పాటలకు ధనశ్రీ వర్మ కొరియోగ్రఫి చేసింది. ఇక ధనశ్రీ వర్మ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనశ్రీ వర్మ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఈమె టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ లాక్ డౌన్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త అతి తక్కువ కాలంలోనే ప్రేమగా మారింది. కొద్ది రోజుల తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. Dhanashree Verma
Dhanashree Verma income after chahal divorce
వివాహం తర్వాత ఎంతో సంతోషంగా వారి వైవాహిక జీవితం కొనసాగింది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా వేరుగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఉండలేకపోయారు. అనంతరం పెద్దల సమక్షంలో విడిపోయారు. విడాకుల సమయంలో చాహల్ నుంచి ధనశ్రీ వర్మ భారీగా భరణాన్ని పొందింది. ఏకంగా 4.75 కోట్ల రూపాయల భరణం తీసుకుంది. విడాకుల తర్వాత ధనశ్రీ వర్మ నికర విలువ భారీగా పెరిగిపోయింది. తన ఆస్తుల విలువ కోట్లలోకి చేరింది. యుజ్వేంద్ర చాహాల్ తో విడాకుల తర్వాత ధనశ్రీ వర్మ నికర విలువ దాదాపు రూ. 25 కోట్లకు పైనే చేరింది. ధనశ్రీ వర్మ నెలవారీగా రూ. 15 నుంచి 35 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తుందని పలు నివేదికలలో వెల్లడైంది.Dhanashree Verma
Also Read: Green Tea: ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే ?
ఈ ఆదాయం ఆమెకు వచ్చే బ్రాండ్ ఎండార్స్మెంట్లు పెయిడ్ ప్రమోషన్లపైన ఆధారపడి ఉంటుంది. వీటి ద్వారా ఆమె భారీగా డబ్బులను సంపాదిస్తుంది. చాహల్ తో విడాకులు తీసుకునే సమయంలో ధనశ్రీ వర్మకు ఇన్ స్టా వేదికగా 5.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 6 మిలియన్లకు ఫాలోవర్లు చేరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ధనశ్రీ వర్మ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతాయి. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ధనశ్రీ వర్మకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. Dhanashree Verma
Also Read: Tollywood: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ..రంగంలోకి రేవంత్ సర్కార్?




















