
Trisha Vijay: ఏంటి త్రిష విజయ్ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉన్నారా అని కొంతమంది షాక్ అవ్వచ్చు.. కానీ ఇది ఎప్పటినుండో వినిపిస్తున్న వార్తలేగా. ఈ వార్తలకు అంత షాక్ అవ్వాల్సిన పనిలేదు. అయితే గిల్లి సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేశాక బ్రేకప్ అయిపోయింది. అయితే లియో సినిమాతో మళ్ళీ వీరి మధ్య కొత్త బంధం ఏర్పడింది.
Trisha Vijay in the same bedroom
ఇక లియో సినిమా చేసినప్పటి నుండి విజయ్ త్రిష మధ్య రిలేషన్ వార్తలు మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ త్రిషలు ఒకే బెడ్రూంలో అంటూ వచ్చే వార్తలపై ఓ జర్నలిస్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన ఎవరంటే..ప్రముఖ జర్నలిస్టు శెయ్యార్ బాలు.. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయినా కూడా ఇంకా సినిమాల్లోనే రాణిస్తుంది.ఆమె ఏజ్ 40 ఏళ్లు దాటింది.(Trisha Vijay)
Also Read: Telugu Films: ఒకేసారి రంగంలోకి నాలుగు తెలుగు సినిమాలు.. హోరాహోరీ పోటీ!!
అది మామూలు విషయం కాదు. కానీ ఆమె సినీ కెరియర్ లో రాణిస్తున్న విషయాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఆమె ఆయనతో తిరుగుతుంది..ఈయన తిరుగుతుంది అని ఎందుకు అంటారు. విజయ్ త్రిష కలిసి కాపురం చేస్తున్నారు. ఒకే బెడ్ రూమ్ లో ఉంటున్నారు అని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు.మీ వద్ద ఏమైనా ప్రూఫ్స్ ఉంటేనే ఇలాంటివి రాయాలి. అలాగే విజయ్ స్టార్ట్ చేసిన పార్టీలో కూడా త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తుంది. విజయ్ త్రిషలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని ముందు పెట్టి మాట్లాడండి.

కానీ ఇలాంటి అనవసరపు పుకార్లు సృష్టించకండి.వారి బెడ్ రూమ్ లోకి మీరు ఎందుకు తొంగి చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జర్నలిస్టు శెయ్యార్ బాలు. ఇక ఈయన చేసిన కామెంట్లకు త్రిష విజయ్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఈయన చెప్పింది 100% కరెక్ట్.. మీరేమైనా విజయ్ త్రిష లు ఉంటున్న రూమ్ లోకి తొంగి చూసారా.. ఒకవేళ అలా చూస్తే ప్రూఫ్స్ తో సహా బయట పెట్టండి అంటూ విజయ్ త్రిష లపై నెగటివ్ కామెంట్లు చేసే వారికి కౌంటర్లు ఇస్తున్నారు.(Trisha Vijay)


