Konda Susmita: రేవంత్ ప్ర‌భుత్వం బండారం బ‌య‌ట‌పెట్టిన కొండా సుస్మిత ?

Konda Susmita: రాత్రి రాత్రికే రేవంత్ ప్ర‌భుత్వం బండారం బ‌య‌ట‌పెట్టారు కొండా సుస్మిత ? సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై విరుచుకు పడ్డ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత… బండారం బ‌య‌ట‌పెట్టారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డిలు కలిసి మా కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కొండా సుస్మిత‌. మా నాన్నను అరెస్ట్ చేసి, మా అమ్మను మంత్రి పదవి నుండి పీకేయాలని చూస్తున్నారని ఆగ్ర‌హించారు. ఈ ప్రభుత్వంలో రెడ్డిలు అంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారని ఫైర్ అయ్యారు. Konda Susmita

Konda Sushmita, who was released by the Revanth government

అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి.. ఆ గన్ రోహిన్ రెడ్డి తెచ్చి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరించాడని నిప్పులు చెరిగారు. ఈ కేసును మా మనిషి సుమంత్ మీద తోసి, మా అమ్మ నాన్న మీదకు డైవర్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. మా అమ్మ నాన్న మీదకు వస్తే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరూ రెడ్డిల పని చెప్తాన‌ని హెచ్చ‌రించారు. అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులను మా ఇంటికి పంపి మా అమ్మను అరెస్ట్ చేసి, మా మీద మర్డర్ అటెంప్ట్ చేద్దామని చూశారని ఆగ్ర‌హించారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి గన్ మెన్లు ఎందుకు ఉన్నారు అసలు? అని నిల‌దీశారు. Konda Susmita

Also Read: Jagan: ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం…రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ కూతురు ?

మా అమ్మ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో పడ్డ టెండర్ ను పొంగులేటి వాళ్ళ మనిషికి ఇచ్చుకున్నాడని నిప్పులు చెరిగారు. మా కుటుంబానికి ఏం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని సుమంత్ గన్ తో బెదిరించినట్లు పోలీసుడు తప్పుడు కేసు ఫైల్ చేశారని, ఈ వివాదం రాజు కుంటోంది. ఈ విషయంలో సుమంత్ కు కొండా సురేఖ కుటుంబం అండగా నిలిచిన నేపథ్యంలో వివాదం రాజుకుంది. Konda Susmita

Also Read: Diwali 2025 : దీపావళి నాడు ఇలా పూజ‌లు చేస్తే, అరిష్ట‌మే..ఇవి తెలుసుకోండి ?

Share your love