Bigg Boss 9వాడిని మాకప్పజెప్పండి కుమ్మేస్తాం అంటూ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ పై ఆడోళ్ళంతా ఫైర్.!

Ladies fire on Bigg Boss 9 contestent

Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లలో ఒకరైనటువంటి భరణి శంకర్ అందరికీ తెలుసు. ఈయన పలు సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర.అయితే అలాంటి భరణి శంకర్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో తన ఆటతో మెప్పిస్తున్నారు.అయితే అలాంటి భరణి శంకర్ బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు తనకు ఎదురైనా ఓ చేదు సంఘటనని ఫన్నీ సంఘటనని బయటపెట్టారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చి.ల.సౌ. స్రవంతి సీరియల్ లో నెగిటివ్ రోల్ చేసిన సంగతి మీకు తెలిసిందే.

Ladies fire on Bigg Boss 9 contestent

అయితే చి.ల.సౌ. స్రవంతి 100 ఎపిసోడ్స్ వేడుకని తిరుపతిలో చేద్దామని మా సీరియల్ యూనిట్ అనుకున్నారు. ఇక ట్రైన్లో అందరం బయలుదేరాం.ఆ తర్వాత ఏదో కొనుక్కుందాం అని నేను ఓ స్టేషన్ రావడంతో అక్కడ దిగాను.అయితే అక్కడ పనిచేసే కొంతమంది ఆడవాళ్లు నన్ను చూసి గుసగుసలు పెట్టుకుంటున్నారు. అరే వాడేరా..ఆ అమ్మాయిని అంత హింస పెడుతున్నాడు..కన్ఫామ్ గా వాడే అని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు పట్టుకొని నా వైపు వచ్చారు.(Bigg Boss 9)

Also Read: Sreeleela: శ్రీలీల తల్లి నిజంగానే ఆ చీప్ పని చేసిందా.. డబ్బు కోసం అంతకు దిగజారిందా.!

దాంతో మా నిర్మాత వచ్చి ఏంటండీ అలా మాట్లాడుతున్నారు అనగా..వీడిని మాకు ఒకసారి అప్పజెప్పండి సార్. వీడు సీరియల్ లో ఆ అమ్మాయిని ఎంతలా హింసిస్తున్నాడు..మాకు ఒకసారి అప్పజెప్పి వెళ్లండి వాడో మేమో తేల్చుకుంటాం. ఈరోజు వాడిని కుమ్మాల్సిందే అంటూ పెద్ద గొడవ చేశారు. అది సీరియల్ లో క్యారెక్టర్ అమ్మా.. రియల్ లైఫ్ లో కాదు అని మా నిర్మాత ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు.

Ladies fire on Bigg Boss 9 contestent

ఇక ఆరోజు వాళ్లందరికీ నచ్చజెప్పి పంపించేసరికి చాలా సమయం పట్టింది. ఇక ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా ఓవైపు ఫన్నీగా మరోవైపు బాధగా అనిపిస్తుంది. కానీ నా పాత్ర ప్రేక్షకుల్లోకి ఎంత బలంగా వెళ్ళిందో ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకున్నాను. ఇక ఈ సీరియల్ నిర్మాత నన్ను చూసినప్పుడల్లా అదే సీన్ గుర్తుకు తెచ్చుకుని నవ్వుతారు అంటూ భరణి చెప్పుకొచ్చారు. ఇక భరణి శంకర్ చి.ల.సౌ. స్రవంతి, సీతామహాలక్ష్మి, సావిత్రి,తరంగాలు, కుంకుమ రేఖ వంటి ఎన్నో సీరియల్స్ లో కీ రోల్స్ పోషించారు.(Bigg Boss 9)

https://www.instagram.com/reel/DPbd3CWjE4Z/?utm_source=ig_web_copy_link
Share your love