Renu Desai: పవన్ కళ్యాణ్ వల్ల రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. ఇంకో సంవత్సరమే ఉంటానంటూ.?

Renu Desai sensational decision because of Pawan Kalyan

Renu Desai: ఏంటి రేణు దేశాయ్ అలాంటి నిర్ణయం తీసుకుందా..ఇంకో సంవత్సరమే ఉంటుందా..ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది.. హ్యాపీగా పిల్లలతో సమయం గడపాల్సింది పోయి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అనే విషయం ఎప్పుడు తెలుసుకుందాం.. రేణుదేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఇలా ఉంటానని,మరో సంవత్సరం తర్వాత కచ్చితంగా సన్యాసుల్లో కలిసిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Renu Desai sensational decision because of Pawan Kalyan

ఇక రేణు మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. ఇదేంటి రేణు దేశాయ్ సన్యాసం తీసుకోవడం ఏంటి.. ఈమెకి ఏమైనా మతిపోయిందా.. ఏజ్ ఏమైనా అయిపోయిందా.. ముసలిదాని లాగా సన్యాసం తీసుకుంటాను అంటుందేంటి.. దీని వెనుక ఏదో మతలబ్ ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు.. అయితే తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అకిరా నందన్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. అకిరా నందన్ ని తెరమీద చూడాలని నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పింది. (Renu Desai)

Also Read: Balakrishna: బాలకృష్ణని జీవితాంతం బాధపెట్టే విషయం.. ఎన్ని కోట్లుంటే ఏం లాభం..?

అలాగే రేణుదేశాయ్ గురించి నెక్స్ట్ ఏంటి అని యాంకర్ అడగగా.. ఏమీ లేదు సన్యాసం తీసుకుంటాను. సన్యాసుల్లో కలిసిపోతాను అంటూ సంచలన కామెంట్స్ చేసింది.ఇక రేణుదేశాయ్ కామెంట్స్ కి యాంకర్ సైతం ఆశ్చర్యపోయింది. అలాగే సన్యాసం తీసుకుంటానని సింబాలిక్ గా మీరు ఈరోజు ఆరెంజ్ కలర్ సారీ వేసుకొచ్చారా అని అడిగితే.. అలాంటిదేమీ లేదు నాకు ఆరెంజ్ కలర్ అంటే ఫేవరెట్.. చిన్నప్పటినుండి మా అమ్మ నన్ను ఈ విషయంలోనే తిడుతూ ఉండేది.

Renu Desai sensational decision because of Pawan Kalyan

అంత ఆరెంజ్ కలర్ ధరించకు సన్యాసి అనుకుంటారు అని అనేది. కానీ చివరికి అమ్మ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. సన్యాసం తీసుకోబోతున్నాను అంటూ మాట్లాడింది.చివర్లో దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పింది.ఇక రేణు దేశాయ్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు పవన్ కళ్యాణ్ చేసిన పని వల్లే రేణు దేశాయ్ సన్యాసుల్లో కలిసిపోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Renu Desai)

https://www.instagram.com/reel/DP_2_b6iXDj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share your love