
Chicken Liver: చికెన్ లివర్ చాలామంది ఇష్టంగా తింటారు. చికెన్ లివర్ మంచిది కాదు అనే సందేహంలో చాలామంది ఉంటారు. అయినప్పటికీ రుచిగా ఉంటుందని కొద్దిగా తినడానికి ఇష్టపడతారు. కానీ చికెన్ లివర్ ఆరోగ్యానికి మంచిది కాదు అనేది పూర్తిగా అవాస్తవం. చికెన్ లివర్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. వారానికి ఒకసారి మాత్రమే చికెన్ లివర్ తినాలి అంతకుమించి తిన్నట్లయితే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. చికెన్ లివర్ లో విటమిన్లు, ప్రోటీన్లు ( Chicken Liver ) అధికంగా ఉంటాయి. దీనిని అధికంగా తిన్నట్లయితే శరీరంలో విష వాయువులు రిలీజ్ అవుతాయి. చికెన్ లివర్ లో విటమిన్ ఏ ఉంటుంది. చికెన్ లివర్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. Chicken Liver
Chicken Liver Health Benefits
ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది. చికెన్ లివర్ లో అధికంగా పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, బి12, జింక్, ఐరన్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. చికెన్ లివర్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో చెడు బ్యాక్టీరియాను నివారించేలా చేస్తుంది. అయితే చికెన్ లివర్ తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలి. దీనిని వండుకునే సమయంలో అధికంగా నూనె వేయకుండా కేవలం ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నూనెను మాత్రమే వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర వేసి చికెన్ లివర్ ను ఫ్రై చేసుకోవాలి. Chicken Liver
Also Read: KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే
ఆ తర్వాత చికెన్ లివర్ ను అన్నంతో కానీ చపాతీతో కానీ తిన్నట్లయితే చాలా మంచిది. చికెన్ లివర్ లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునే వారు మాత్రం చికెన్ లివర్ అసలు తినకూడదు. చికెన్ లివర్ లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అసలు మంచిది కాదు. ఇందులో ఉండే కొవ్వు వేగంగా బరువు పెరిగేలా చేస్తాయి. దానివల్ల అధికంగా బరువు పెరుగుతారు. కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు కూడా చికెన్ లివర్ అస్సలు తినకూడదు. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు సంతోషంగా చికెన్ లివర్ వారానికి ఒకటి లేదా రెండు సార్లు తప్పకుండా తినవచ్చు. Chicken Liver
Also Read: Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?

