KTR: నా చావుకు కారణం కేటీఆర్… లేడీ గులాబీ నేత పోస్ట్ ?

Asha priya post on KTR BRS
Asha priya post on KTR BRS

KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మన చావుకు కల్వకుంట్ల తారకరామారావు కారణమంటూ గులాబీ పార్టీకి సంబంధించిన ఓ లేడీ కార్యకర్త సంచలన పోస్ట్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ కు సంబంధించిన ఆశాప్రియ ముదిరాజ్ అనే గులాబీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తకు అలాగే గులాబీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కు మధ్య గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆమెను సోషల్ మీడియా వేదికగా టార్చర్ పెడుతున్నారని స్వయంగా ఆశాప్రియ పోస్టులు పెట్టింది. KTR

Asha priya post on KTR BRS

తన క్యారెక్టర్ పై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఎమోషనల్ అయింది. దీంతో తన జీవితం నాశనమైందని ఆమె వెల్లడించింది. ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అయితే అలాంటి ఆశప్రియ గత కొన్ని రోజులుగా గులాబీ పార్టీకి దూరంగా ఉంటూనే ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పై కౌంటర్ ఇస్తోంది. ఇక లేటెస్ట్ గా కేటీఆర్ పై సంచలన పోస్ట్ పెట్టింది ఆశా ప్రియ. తన చావుకు కేటీఆర్ కారణమంటూ బాంబు పేల్చింది. KTR

Also Read: KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పీజేఆర్ కు తనకు ఉన్న పంచాయతీని కేటీఆర్ పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేసింది. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడం గ్యారెంటీ అంటూ బెదిరింపులకు దిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కామెంట్స్ బాక్స్ క్లోజ్ చేసింది. ఈ పోస్టు ను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాగా వాడుకుంటోంది. ఓ లేడీ కార్యకర్తకు కేటీఆర్ న్యాయం చేయడం లేదు.. తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని కాంగ్రెస్ వారియర్స్ రెచ్చిపోతున్నారు. దీంతో ఆశా ప్రియ పెట్టిన పోస్ట్ గులాబీ పార్టీకి తలనొప్పులు తీసుకువచ్చింది. KTR

Also Read: Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?

https://twitter.com/ashapriya09/status/1980863733569290290
Share your love