
Manchu Lakshmi: గత కొద్ది రోజుల నుండి మంచు ఫ్యామిలీలో ఎన్నో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. మనోజ్ విష్ణు కి అస్సలు పడడం లేదు.. వీరిద్దరి మధ్య ఉప్పు నిప్పులా కొద్ది రోజులుగా గొడవలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ గొడవలు మరింత పెద్దది చేసేలా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంట్లో జరిగే గొడవలపై సంచలన వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి.మీరంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టింది.మరి ఇంతకీ మంచు లక్ష్మి ఈ శాపనార్థాలు ఎవరికి పెట్టింది..మనోజ్ కా..విష్ణు కా.. అనేది ఇప్పుడు చూద్దాం.
Manchu Lakshmi curses them saying they will be destroyed
మంచు లక్ష్మి శాపనార్ధాలు మనోజ్ కి గానీ, విష్ణుకి గానీ కాదు. మనోజ్, విష్ణు ల మధ్య ఉన్న గొడవకి మరింత అగ్గి రాజేస్తూ దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై. తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఇంట్లో గొడవల గురించి చెప్పింది.మా ఇంట్లో ఉన్న గొడవల్ని మరింత పెద్దది చేసేలా కొంతమంది థంబ్ నెయిల్స్ సృష్టించి మరీ ఫేక్ వార్తలు రాస్తున్నారు. మిరాయ్ సినిమా ఈవెంట్లో మనోజ్, విష్ణుని ఉద్దేశించి ఎలాంటి మాటలు కూడా మాట్లాడలేదు.(Manchu Lakshmi)
Also Read: Rashmika: స్టార్‌డమ్‌కి మించిన క్యారక్టర్.. ప్యాషన్ కోసం పేమెంట్ వదులుకున్న ‘నేషనల్ క్రష్’!!
అలాగే వాడు మాట్లాడిన మాటల్ని కట్ చేస్తూ ఎడిట్ చేసి విష్ణు పై నెగిటివ్ గా మాట్లాడాడు అంటూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు థంబ్ నెయిల్స్ సృష్టించారు. కానీ ఇలాంటి థంబ్ నెయిల్స్ సృష్టించిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఉన్న గొడవల్ని పెద్దది చేస్తున్నారు అంటూ ఫేక్ రాయుళ్ల కి శాపనార్థాలు పెట్టింది మంచు లక్ష్మి.

అలాగే తన కూతుర్ని విష్ణు స్కూల్ మాన్పించేసినట్టు కూడా తెలిపింది.అయితే విష్ణు తో నాకు ఏమీ గొడవ లేదని, కానీ తన కూతురు విష్ణు స్కూల్ కి వెళ్తే సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తున్నారని,అలా ఉండడం ఇష్టం లేక నేను ఓ చిన్న స్కూల్లో జాయిన్ చేశానని ఆ తర్వాత ముంబైకి వెళ్ళాక నా కూతురు సెలబ్రిటీ లాగా కాకుండా అందరి పిల్లల్లాగే స్వేచ్ఛగా పెరుగుతుందని తెలియజేసింది.(Manchu Lakshmi)





Manchu Lakshmi: ఫ్యామిలీ గొడవలపై మంచు లక్ష్మీ ఎమోషనల్.. ఆ దేవుడు కనిపిస్తే అదే కోరుకుంటా అంటూ.!