
TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంశం విభాగంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో అంశంపై ఆయన వివాదంలో చిక్కుకుంటున్నారు. వైసిపి పార్టీని అటాక్ చేయాల్సింది పోగా… సొంత ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరుగుతోంది. TDP
The invisible power in TDP behind Kolikapudi Srinivasa Rao
రోడ్లు సరిగా వేయడం లేదని మొదట్లో కూటమి ప్రభుత్వం పైనే తిరుగుబావుట ఎగురవేశారు కొలికపూడి శ్రీనివాసరావు. అలాగే టిడిపి కార్యకర్తలను తిట్టడం కూడా జరిగింది. వీటన్నిటిని చంద్రబాబు నాయుడు సహించి కొలికిపూడి శ్రీనివాసరావు పై ఎలాంటి వేటు వేయలేదు. అయితే ఇటీవల కాలంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్నిని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు టికెట్ కోసం తన దగ్గర కేశినేని చిన్ని డబ్బులు తీసుకున్నట్లు బాంబు పేల్చారు. TDP
Also Read: Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?
అయితే ఇలాంటి వ్యాఖ్యలు కొలికపూడి శ్రీనివాసరావు చేయలేదని.. అతని వెనుక ఉన్న ఓ అదృశ్య శక్తి ఈ పని చేయిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక వ్యక్తి … కొలికపూడి శ్రీనివాసరావును నడిపిస్తున్నారట. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నానికి చెక్ పెట్టేందుకు పావులా కొలికపూడి వాడుకుంటున్నాడట సదరు రహస్య టిడిపి లీడర్. ఈ అంశం ఇప్పుడు కోస్తా ప్రాంతంలో ఆ టాపిక్ అయింది. TDP
Also Read: Jubilee Hills bypoll: మాగంటి సునీతపై కేసు నమోదు.. చిక్కుల్లో BRS పార్టీ?




















