
BRS: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కేటీఆర్ కు పెను సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు గులాబీ పార్టీ చాలా కష్టపడుతోంది. హైదరాబాదులో కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ బాధ్యత తీసుకుంటున్నారు. గతంలో కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటి చేత్తో గులాబీ పార్టీని కేటీఆర్ గెలిపించారు. హైదరాబాదులో కూడా కేటీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. BRS
If BRS loses in Jubilee Hills will KTR resign
2023 ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ పనితీరు చూసి అన్ని స్థానాల్లో గులాబీ పార్టీని గెలిపించారు హైదరాబాద్ ప్రజలు. అలాంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉపఎన్నిక కేటీఆర్ కు సమాలుగా మారింది. హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న నేపథ్యంలో ప్రచారానికి దూరమయ్యారు. దీంతో కేటీఆర్ సింగిల్ హ్యాండ్ గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో దాదాపు గులాబీ పార్టీ గెలుస్తుందని ప్రచారమైతే సాగుతోంది. BRS
Also Read: Jubilee Hills Bypoll: బీజేపీలో గులాబీ పార్టీ విలీనం.. రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్?
కానీ అధికార పార్టీ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కేటీఆర్ పదవిపోవడం గ్యారంటీ అంటున్నారు. గులాబీ పార్టీ ఓడిపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి కేటీఆర్ రాజీనామా చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన రాజీనామా చేస్తే, హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. హరీష్ రావు ఆధ్వర్యంలోనే 2028 అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ పార్టీ పోతుందని అంటున్నారు. ఒకవేళ గులాబీ పార్టీ విజయం సాధిస్తే.. నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రచారం కూడా చేస్తున్నారు. BRS
Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్..ఇక కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా…
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





