IND VS SA: గంభీర్ చెత్త నిర్ణ‌యాలు..3వ‌ స్థానంలో సుంద‌ర్‌..సాయి సుద‌ర్శ‌న్ కెరీర్ ఖ‌తం ?

IND VS SA: దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాల్టి నుంచి మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మొదట బౌలింగ్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభమై లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి వందకు పైగా పరుగులు చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయింది. IND VS SA

IND VS SA Washington Sundar to replace Sai Sudharsan

ఇవాళ సాయంత్రం లోపు మిగిలిన ఆర్ వికెట్లు కూడా టీమిండియా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా పక్కకు పెడితే, టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లో సాయి సుదర్శన్ లాంటి కీలక ప్లేయర్ను పక్కకు పెట్టారు గౌతమ్ గంభీర్. అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే సాయి సుదర్శన్ ను పక్కకు పెట్టి వాషింగ్టన్ సుందర్ ను మూడవ స్థానంలో తీసుకుంది టీమిండియా. ఆల్ రౌండర్ గా పనికి వస్తాడని వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారు. మొన్న ఆస్ట్రేలియా గడ్డపై కూడా వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు. IND VS SA

Also Read: Arjun Tendulkar: ప్ర‌మాదంలో స‌చిన్ కొడుకు కెరీర్..న‌ట్టేట ముంచేసిన అంబానీ ?

ఇలాంటి నేపథ్యంలోనే సాయి సుదర్శన్ పై వేటు వేశారు. దీనిపైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతలా వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవాలనుకుంటే దృవ్ జురెల్ ను తప్పిస్తే సరిపోయేది కదా అంటున్నారు అభిమానులు. రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా ఉండగా ధ్రువ జురెల్ ఎక్స్ట్రా ప్లేయర్. అందుకే అతని స్థానంలో సుందర్ ను తీసుకుంటే సరిపోయేది అని, సాయి సుదర్శన్ ను మూడో స్థానంలో తీసుకుంటే టీమిండియా అద్భుతంగా విజయం సాధించేదని కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయాల కారణాల వల్ల టీమిండియా ఇలా నాశనం అవుతుందని ఫైర్ అవుతున్నారు. IND VS SA

Also Read: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?

Share your love