Cm Revanth Reddy: టీవీ 9ను టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..బ్యాన్ వేస్తామంటూ?

Cm Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీవీ9 ఛానల్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగగా, 14వ తేదీన అంటే నిన్న కౌంటింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. అయితే ఈ విజయం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. Cm Revanth Reddy

Cm Revanth Reddy warns tv9 channel

ఈ సందర్భంగా విజయం సాధించిన నవీన్ యాదవ్ను మెచ్చుకుంటూనే గులాబీ పార్టీతో పాటు టీవీ9 ఛానల్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. గులాబీ పార్టీ మునిగిపోయిన నావా అని మండిపడ్డారు. కేటీఆర్ అలాగే హరీష్ రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని నిప్పులు చెరిగారు. అయితే అదే సమయంలో టీవీ9ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొన్ని చానల్లో గులాబీ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. Cm Revanth Reddy

Also Read: IND VS SA: గంభీర్ చెత్త నిర్ణ‌యాలు..3వ‌ స్థానంలో సుంద‌ర్‌..సాయి సుద‌ర్శ‌న్ కెరీర్ ఖ‌తం…

మూడో రౌండ్లో 240 ఓట్ల మెజారిటీ గులాబీ పార్టీకి వస్తే, కొన్ని చానల్లో మొత్తం గెలిచినట్లే ఫీల్ అయినట్లు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో కొన్ని చానళ్లపై బ్యాన్ విధించారు.. నేను కూడా విధించగలను, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై వ్యతిరేకంగా వార్తలు వేసిన కూడా క్షమించినట్లు వెల్లడించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీవీ9 ను ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. Cm Revanth Reddy

Also Read: Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నిక‌లు ప‌క్కా ?

Share your love