
Manchu Lakshmi: సినిమా స్టార్స్ ఫ్యామిలీలు అంటే ఏ విధమైన సెక్యూరిటీ ఉంటుందో మనందరికీ తెలుసు. వారికి పుట్టిన పిల్లలనుంచి మొదలు కుటుంబ సభ్యులందరికీ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాదు ఎవరైనా స్టార్ హీరో హీరోయిన్లు అయితే వారి ఫ్యామిలీలో ఉండే వారి ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. వారి పిల్లలు స్కూల్ కి వెళ్లినా కాలేజీకి వెళ్లినా తప్పనిసరిగా చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు.
A man touched Manchu Lakshmi indecently
అలా టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నటువంటి ఆ హీరో కూతురుని ఒకానొక సమయంలో కొందరు అసభ్యంగా తాకారట.. మరి ఆమె ఎవరా అంటే .. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవ్వడమే కాకుండా, రాజకీయంగా.. వ్యాపార పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అలాంటి ఈయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. అయితే కూతురు మంచు లక్ష్మి 15 ఏళ్ల వయసులోనే ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది..(Manchu Lakshmi)
Also Read: Varanasi: రాజమౌళి మహేష్ కాదు.. వారణాసి ఈవెంట్ మొత్తం ఆ డైరెక్టర్ జపమే చేసిందిగా..!
మంచు లక్ష్మి పదవ తరగతి చదువుతున్న సమయంలో ప్రతిరోజు కారులో వెళ్లేదట. తన వెంట ఎప్పుడూ డ్రైవర్ లేదా బాడీగార్డ్ లేదంటే వాళ్ళ అమ్మ ఉండేదట. అంతేకాదు నేను ఒక పెద్ద హీరో కూతురుని కాబట్టి నన్ను ప్రతి ఒక్కరు గుర్తుపట్టేవారు. కానీ ఓసారి మా స్కూల్ వాళ్ళు మాకు హాల్ టికెట్లు ఇవ్వడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. కానీ దారిలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు..

నాకా టైం లో చాలా గిల్టీగా అనిపించింది. అసలు నేను చిన్నపిల్లను అనే విషయం అతనికి తెలియదా లేదా కావాలనే తాకాడ నాకు అర్థం కాలేదు.. చేసేదేమీ లేక అతని నుంచి పక్కకు జరిగాను అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఏడ్చాను, దీంతో మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఓదార్చారు. అంతేకాదు ఆ సమయంలో వాళ్లు కూడా తమ బాధలు చెప్పుకున్నారు. మేం కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారని ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఈ విధంగా మంచు లక్ష్మి తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి స్యాడ్ మూమెంట్ ని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది..(Manchu Lakshmi)





Manchu Lakshmi: ఫ్యామిలీ గొడవలపై మంచు లక్ష్మీ ఎమోషనల్.. ఆ దేవుడు కనిపిస్తే అదే కోరుకుంటా అంటూ.!