Potatoes: బంగాళదుంపలు అతిగా తింటున్నారా..అయితే ప్ర‌మాదంలో ప‌డ్డట్టే?

Potatoes: ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ పదం మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఆరోగ్యం పట్ల ఏ ఒక్కరు శ్రద్ధ చూపించడం లేదు. అయితే ప్రస్తుత కాలంలో బంగాళదుంపలు బాగా తిని ఎనర్జీ పెంచుకుందామని చాలామంది అనుకుంటారు. అయితే ఈ బంగాళదుంపలు మోతాదులో తింటే పర్వాలేదు, కానీ విపరీతంగా తింటేనే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. Potatoes

Potatoes are nutritious, providing essential vitamins

ఈ బంగాళదుంపలు అతిగా తినడం వల్ల మనిషి బరువు విపరీతంగా పెరుగుతుందట. ముఖ్యంగా ఆలు చిప్స్ తింటే ప్రమాదమే అని చెబుతున్నారు. కొవ్వు పెరగడమే కాకుండా షుగర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయట. షుగర్ తో పాటు బీపీ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందట. ఈ బంగాళదుంపలు తినడం వల్ల వాతం పెరుగుతుంది. Potatoes

Also Read: Kavitha: రేవంత్ రెడ్డి -కల్వకుంట్ల కవిత కాంబినేషన్ లో బడా కంపెనీ ?

అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు లాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు అస్సలు ఈ బంగాళాదుంపలు తినకూడదని చెబుతున్నారు. బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల అధిక కార్బోహైడ్రేట్లు పెరిగి చక్కర స్థాయిలు అతివేగంగా పెరుగుతాయట. దానివల్ల షుగర్ ప్రమాదకర స్థితిలోకి వెళ్తుంది అని అంటున్నారు వైద్యులు. కాబట్టి ఏది కూడా అతిగా తినకూడదు. వైద్యులు చెప్పినట్లుగానే మోతాదులో బంగాళదుంపలు తినాలి. Potatoes

Also Read: Vangaveeti Ranga: వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ?

Share your love