
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ వారణాసి.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని తాజాగా నవంబర్ 15న ఒక పెద్ద ఈవెంట్ ని చేసి రివీల్ చేశారు.ఇక ఇదే ఈవెంట్లో టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ వీడియో కూడా రిలీజ్ చేశారు.ఇక ఈ వీడియోలో మహేష్ బాబు ఎద్దు మీద కూర్చుని త్రిశూలం పట్టుకొని వస్తూ ఉంటాడు. ఆయన మొహంలో ఫైర్ లుక్ కనిపిస్తుంది.
Trolls On Mahesh Babu look
అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఇన్ని రోజులు మా మహేష్ బాబు సంపాదించుకున్న పరువు మొత్తం పాయే..ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తాన్ని రాజమౌళి చెడగొట్టాడు. (Mahesh Babu)
Also Read: Varanasi: రాజమౌళి మహేష్ కాదు.. వారణాసి ఈవెంట్ మొత్తం ఆ డైరెక్టర్ జపమే చేసిందిగా..!
మహేష్ బాబుని చూస్తే అచ్చం ఆ హీరోల్లాగే ఉంది అంటూ టోల్స్ చేస్తున్నారు. అంతేకాదు తేజ సజ్జా, అఖిల్ లాగే మహేష్ బాబు లుక్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు కి ఈ సినిమాలో గడ్డం,మీసం, జుట్టు ఏవి సెట్ కాలేదు అని,మహేష్ బాబు లుక్ పై రాజమౌళి ఇంకొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది అని అంటున్నారు. అయితే రీసెంట్ గా వచ్చినా మిరాయ్ మూవీలోని తేజ లుక్,అఖిల్ చేస్తున్న లెనిన్ మూవీ లుక్ రెండు కలిపి మహేష్ బాబుని చూపించారంటూ ట్రోల్ చేస్తున్నారు.(Mahesh Babu)





